వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: హైబీపీ తగ్గాలంటే మీ ఆహారం ఇలా తీసుకోండి.. ఆపై రిజల్ట్ మీరే చూడండి!!

|
Google Oneindia TeluguNews

హై బీపీ... ఇప్పుడు దేశవ్యాప్తంగా 100 మందిలో 90 మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య. మన జీవనశైలి, ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అనేక అంశాలు హైబి.పి రావడానికి ప్రధానమైనటువంటి కారణాలుగా తెలుస్తున్నాయి. ఇక హై బీపీ వల్ల అనేక రకాల జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. హైబీపీ శరీరంలోని గుండె, మూత్రపిండాలు, లివర్, బ్రెయిన్ వంటి వాటిపై తీవ్రప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడు బీపీ ని కంట్రోల్ లో ఉంచుకోవాలి.

ఆకుకూరలతో బీపీ కంట్రోల్

ఆకుకూరలతో బీపీ కంట్రోల్

బీపీ ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి మన ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. కొన్ని ఆహార పదార్థాలు బీపీ ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇక అటువంటి వాటిలో ఆకుకూరలు ఒకటి.

ఆకుకూరలతో బీపీ బాగా కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా పాలకూర, ఆకుపచ్చని కూరగాయలు, అవకాడో, బీన్స్, క్యాబేజీ వంటి వాటిని ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం రక్తపోటును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

రోజుకో టమాటా తినండి .. ఆపై రిజల్ట్ మీరే చూడండి

రోజుకో టమాటా తినండి .. ఆపై రిజల్ట్ మీరే చూడండి

ఇక అంతే కాదు టమాటాలు కూడా బీపీ ని కంట్రోల్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఒక టమాటాను తిన్నట్లయితే బీపీ అదుపులో ఉంటుందని చెప్తున్నారు. మీ ఆహారంలో టమాటాలను ఒక భాగంగా మార్చుకుంటే టమాటాలో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధిక రక్తపోటును ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

బీపీ కంట్రోల్ లోకి రావాలంటే మాంసానికి బదులు చేపలు తినండి

బీపీ కంట్రోల్ లోకి రావాలంటే మాంసానికి బదులు చేపలు తినండి

బీపీని కంట్రోల్ చేసుకోవడం కోసం మన ఆహారంలో చేపలు ఎక్కువగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. రెడ్ మీట్ ను తగ్గించి, చేపలను అధికంగా తీసుకోవడం వల్ల చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి అని, అవి ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇక మన ఆహారంలో మాంసానికి బదులుగా చేపలు తీసుకుంటే, బీపీని అదుపులో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు.

బీపీ నియంత్రణకు వెల్లుల్లి, అవిసె గింజలు ఎంతో ఉపయుక్తం

బీపీ నియంత్రణకు వెల్లుల్లి, అవిసె గింజలు ఎంతో ఉపయుక్తం

అంతేకాదు బీపీ ని కంట్రోల్ చేయడానికి మన ఆహారం లో వెల్లుల్లిని అధికంగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వెల్లుల్లి వల్ల కండరాలకు విశ్రాంతి దొరికి రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో అవిస గింజలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. అవిస గింజలు కూడా సూపర్ ఫుడ్ అని వాటిలో బీపీని నియంత్రించటానికి అవసరమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయని, అవి బీపీ ని కంట్రోల్ చేయడానికి కీలకంగా పనిచేస్తాయని చెబుతున్నారు.

బీపీని తగ్గించే అరటి పండ్లు, పిస్తా పప్పులు

బీపీని తగ్గించే అరటి పండ్లు, పిస్తా పప్పులు

ఇక రక్తపోటును కంట్రోల్ చెయ్యటంలో అరటి పండ్లు కీలకంగా పని చేస్తాయని అంటున్నారు. అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి బీపీని తగ్గిస్తాయని చెప్తున్నారు. దీంతో రక్తపోటు తగ్గుతుంది. బీపీని నిరోధించటానికి మనం తీసుకునే ఆహారంలో పిస్తా పప్పు ను కూడా చేర్చుకుంటే మంచిదని చెబుతున్నారు. దీనిలో ఉండే ఫైబర్, అధిక ప్రోటీన్ బీపీ ని కంట్రోల్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
If you want to reduce high blood pressure, take your diet with green vegetables, tomatoes, garlic, pista nuts, bananas, flax seeds, and fish.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X