health tips: టమాటాలే అని తక్కువగా చూస్తున్నారా? ఆరోగ్యం కాపాడటంలో వాటివిలువ తెలిస్తే అవాక్కవుతారు!!

టమాటాలు... ఇవి లేనిదే వంటింట్లో వంట చేసే మహిళలకు పూట గడవదు. నిత్యం కూరలలో చాలా ఇళ్లలో టమాటాలు ఒక భాగంగా ఉంటాయి. ఇంట్లో టమాటాలు లేకపోతే, కూరగాయలు లేనట్టుగా బాధపడే మహిళలు చాలామంది ఉన్నారు. అటువంటి టమాటాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి అనే విషయాలు చాలా మందికి తెలియదు. ఈ కథనంలో మన ఆరోగ్యానికి టమాటాలు ఏ విధంగా మేలు చేకూరుస్తాయి? టమాటా లో ఉండే పోషక విలువలు మన ఆరోగ్యానికి ఏ విధంగా దోహదం చేస్తున్నాయి? అనే విషయాలు తెలుసుకుందాం.

టమాటాలలో పుష్కలంగా పోషకాలు ..

టమాటాలలో పుష్కలంగా పోషకాలు ..

టమాటాలు మంచి పోషక విలువలు ఉన్న పండ్లు. టమాటా లో ఉండే విటమిన్ కె, క్యాల్షియం, లైకోపీన్ మన శారీరక ఆరోగ్యం బాగుపడడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వచ్చే ప్రమాదాలను తగ్గించడంతో పాటుగా, మన బీపీని అదుపులో ఉంచడానికి ఎముకల దృఢత్వానికి టమాటాలు ఎంతగానో ఉపయోగపడతాయి. టమాటాలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉన్నాయి. టమాటాలలో లైకోపీన్, బీటా కెరోటిన్, లుటిన్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ ఆమ్లాలూ, టానిన్లు మన శారీరక ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి.

విటమిన్లు, ఖనిజలవణాలతో యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్న టమాటాలు

విటమిన్లు, ఖనిజలవణాలతో యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్న టమాటాలు

విటమిన్లు మరియు ఖనిజ లవణాలు కూడా టమాటాలలో పుష్కలంగా ఉంటాయి. ఒక మీడియం సైజు టమాటాలో 28 శాతం విటమిన్-సి ఉంటుందని, విటమిన్ సి మనుషులకు ఒక ముఖ్యమైన పోషకంతో పాటు యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక టమాటాలలో ఉండే విటమిన్ కె 1 రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది అని ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

అనేక వ్యాధుల రిస్క్ ను తగ్గించటంలో టమాటాలకు ప్రత్యేక స్థానం

అనేక వ్యాధుల రిస్క్ ను తగ్గించటంలో టమాటాలకు ప్రత్యేక స్థానం

అంతేకాదు విటమిన్ బీ9 కూడా ఆరోగ్యకరమైన కణజాల అభివృద్ధికి సహాయపడుతుందని చెబుతున్నారు. టమాటాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందని, గుండె జబ్బులను నియంత్రిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా టమాటాలను బాగా తీసుకునేవారిలో రక్తపోటు అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మరి ప్రతిరోజు ఒక గ్లాసు టమోటా జ్యూస్ తీసుకునేవారిలో రక్తపోటు అదుపులో ఉందని గుర్తించినట్టు వైద్యులు చెప్పారు.

 రక్తపోటును నియంత్రించటంలో టమాటాల ప్రయోజనం ఎంతో

రక్తపోటును నియంత్రించటంలో టమాటాల ప్రయోజనం ఎంతో

తక్కువ సోడియం తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది అని, అదే సమయంలో, పొటాషియం తీసుకోవడం కూడా రక్తపోటును తగ్గిస్తుందని చెబుతున్నారు. టమాటాలలో పొటాషియం పుష్కలంగా ఉంటుందని మరియు అందువల్ల, అవి ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అధిక పొటాషియం తీసుకోవడం శరీరంలోని అదనపు సోడియంను తొలగిస్తుందని చెబుతున్నారు. ఇది రక్త నాళాల గోడల నుండి పెరిగిన మరియు పేరుకుపోయిన ఒత్తిడిని తగ్గిస్తుందని చెప్తున్నారు. ఫలితంగా, ఇది రక్తపోటును మరింత తగ్గిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

గుండె జబ్బుల నివారణకు టమాటాలు

గుండె జబ్బుల నివారణకు టమాటాలు

అంతేకాదు గుండెపోటు వంటి జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా టమాటాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అధిక పొటాషియం తీసుకోవడం వల్ల హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. కండరాల క్షీణత కూడా తగ్గుతుంది. టమాటాలలో ఫోలేట్ ఉంటుంది కాబట్టి అది గుండెజబ్బుల ప్రమాదాలను బాగా తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

మనం నిత్యం ఇళ్ళలో వాడే టమాటాలు ఇంకా మరెన్నో జబ్బుల నియంత్రణకు దోహదం చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+