Hug day 2024: కౌగిలింతల రకాలు... ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!!
కౌగిలింత... ఈ పదం వింటే ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం కలుగుతుంది. కానీ కౌగిలింత మంచిదే.. కౌగిలింత మనకు కావాల్సిన ఆత్మ విశ్వాసాన్ని, ధైర్యాన్ని, మన కోసం ఒకరు ఉన్నారన్న భావనను కలిగిస్తుంది. నేడు హగ్ డే.. వాలంటైన్స్ వీక్ లో ఈ రోజు హగ్ డే గా జరుపుకుంటున్నారు.
ఈ రోజు ప్రేమికులు తమ ప్రియమైన వారిని హగ్ చేసుకుని తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇక కౌగిలింతలలోనూ అనేక అర్ధాలు ఉంటాయి. కౌగిలించుకునే తీరును బట్టి అర్ధాలు మారుతూ ఉంటాయి. అసలు కౌగిలింతలు ఎన్ని రకాలు.. వాటి అర్దాలేమిటి? కౌగిలింతల వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

డీప్ హగ్:చాలా మంది ప్రియమైన వారిని నేరుగా, గాఢంగా హగ్ చేసుకుంటారు. ఈ కౌగిలింత వారి లోతైన భావోద్వేగ కనెక్షన్ ను, అవతలి వ్యక్తితో ఉన్న బలమైన భద్రతా భావాన్ని సూచిస్తుంది. వారు ఎప్పుడూ తమకు సన్నిహితంగా ఉండాలనే కోరికను స్పష్టం చేస్తుంది. భాగస్వాముల మధ్య లోతైన బంధాన్ని ప్రదర్శిస్తుంది.
బేర్ హగ్:చాలా మంది తమ స్వచ్చమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని తెలియజేసేలా హగ్ చేసుకుంటారు. చాలా సంతోషంగా , చాలా కాలం విడిపోయిన తర్వాత కలుసుకున్న సమయంలో చేసుకున్న ఈ హగ్ ను బేర్ హగ్ అంటారు. ఈ హగ్ స్నేహితుల మధ్య, ప్రియమైన వారి మధ్య భాగస్వామ్యం చేయబడుతుంది.
నడుము దగ్గరగా పట్టుకునే హగ్:
ఈ హగ్ వారిలోని బలమైన సెక్స్ కోరికను సూచిస్తుంది.శృంగార కోరిక ఎక్కువగా ఉన్నవారు భాగస్వామికి ఆ కోరికను వ్యక్తం చెయ్యటం కోసం నడుము నుండి గట్టిగా పట్టుకుని హగ్ చేసుకుంటారు. ఇది భౌతికంగా దగ్గరగా ఉండాలనే కోరికను సూచిస్తుంది. వారిలోని రోమాన్స్ ను తట్టి లేపుతుంది.
వీపుపై సున్నితమైన తడుములతో కూడిన హగ్:ఈ హగ్ ఆప్యాయతను, కష్టాల్లో ఉన్నవారికి ఓదార్పును సూచిస్తుంది. వారికి కావాల్సిన మద్దతును ప్రదర్శిస్తుంది. వీపుపై సున్నితంగా స్పృశిస్తూ చేసే ఈ హగ్ వారిలో ఉన్న అవగాహన, మరియు అవతలి వ్యక్తిపై ఉన్న సానుభూతిని స్పష్టం చేస్తుంది. ఇది వారికి తామున్నామన్న భరోసా ఇస్తుంది.

వెనుక నుండి హగ్:ఒక వ్యక్తి తనకు ఇష్టమైన వారిని వెనుక నుండి హగ్ చేసుకుంటే వారిపై ప్రేమకు ఇది అద్దం పడుతుంది. ఒక వ్యక్తి మరొకరి వెనుక నిలబడి ఛాతీ లేదా మెడ చుట్టూ చేతులు వేసి, వారి వీపును దగ్గరగా తాకేలా డీప్ గా హగ్ చేసుకుంటారు. ఇది అవతలి వ్యక్తిపై ఉన్న ప్రేమ, అభిమానం, మద్దతు, సాన్నిహిత్యాన్ని చూపుతుంది. దీని ద్వారా వారిలోని శృంగార కోరికలు కూడా తెలియజేయవచ్చు.
ఒకవైపే ఆలింగనం చేసుకోవటం:చాలా మంది ఒకవైపే ఆలింగనం చేసుకుంటారు. ఇది స్నేహితుల మధ్య వారి బంధాన్ని, పరిచయాన్ని సూచిస్తుంది. శృంగార సమయంలో అయితే డీప్ గా వెళ్లొద్దు అన్న సంకేతాన్ని ఇస్తుంది. రక్షణ భావాన్ని కూడా కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications