Betel leaf: భోజనం తర్వాత తమలపాకు తీసుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..

చాలా మంది భోజనం అనంతరం తమలపాకులు తీసుకుంటారు. మరి భోజనం తర్వాత తమలపాకులు తింటే మంచిదేనా.. అంటే మంచిదే అని చెబుతున్నారు నిపుణులు. ఈ ఆకులు ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అందుకే మన తాతలు, ముత్తాల కాలం నుంచి వీటిని ఉపయోగిస్తూ వస్తున్నారు. తమలపాకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఇటీవల పలు అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి టైప్ 2 డయాబెటిక్ రోగులు కూడా దీనిని తీసుకోవచ్చు.

కెరోటిన్

కెరోటిన్


ఈ తమలపాకుల్లో నియాసిన్, కెరోటిన్, విటమిన్ సి, రైబోఫ్లావిన్, కాల్షియం వంటి ఎన్నో పోషకాలుంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో విధాలుగా రక్షిస్తాయి. తమలపాకు ఎలాంటి నొప్పులనైనా ఇట్టే తగ్గించగలదు. అలాగే జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. చలికాలంలో తమలపాకును తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందట.

 క్యాన్సర్ నిరోధకాలు

క్యాన్సర్ నిరోధకాలు


తమలపాకుల్లో యాంటీ మైక్రోబియల్ క్యాన్సర్ నిరోధక, డయాబెటిక్ వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి. కార్డియో వాస్కులర్ డిసీజ్, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు నివారణలో తమలపాకు తోడ్పడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. తమలపాకుల్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ నుంచి మనల్ని రక్షిస్తాయి. ఉదర సమస్యలను కూడా పోగొడుతాయి.

మలబద్దకం

మలబద్దకం


మలబద్దకం సమస్యతో బాధపడేవారికి తమలపాకు మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మలబద్దకం సమస్యను పోగొడుతుంది. దీన్ని తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. రక్తప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుందట. తమలపాకుల్లో పుష్కలంగా ఉండే పాలీఫెనాల్స్ మనల్ని ఎన్నో రకాల క్రిమికీటకాల నుంచి రక్షణ కల్పిస్తాయి.

ఆస్తమా,

ఆస్తమా,


తమలపాకు జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందది. ఆస్తమా, ఛాతి నొప్పిని తగ్గించడానికి కూడా తమల పాకులు ఉపయోగపడతాయి. తలనొప్పి, మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో తమలపాకులు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం తమలపాకు నుంచి రసం తీసి దానితో నుదురుకు మసాజ్ చేయాలి. కొద్ది సేపట్లోనే తలనొప్పి మటుమాయం అవుతుంది.

గాయాలు, వాపు

గాయాలు, వాపు


తమలపాకుల్లో ఉండే ఔషదగుణాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంటను, గాయాలు, వాపును తగ్గిస్తాయి. తమలపాకులను వేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందట. ఆకలి లేనివారికి ఇది మెడిసిన్ లా పనిచేస్తుంది. కొద్దిగా ఆకుముక్కను తీసుకుని నమిలితే ఆకలి బాగా అవుతుందట.

మానసిక స్థితి

మానసిక స్థితి


తమలపాకు ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్‌ను అదుపు చేయకపోవడం వల్ల కలిగే మంటను నివారిస్తుంది. తమలపాకులో సుగంధ ఫినోలిక్ సమ్మేళనాలు ఉండటం వల్ల కాటెకోలమైన్‌ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+