India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలి పాడ్యమి అంటే ఏమిటీ..? ఎన్ని దీపాలు వెలిగించి.. నేపథ్యం ఇదే

|
Google Oneindia TeluguNews

పోలి పాడ్యమి.. కార్తీక మాసం చివరి రోజు చేసే క్రతువు. ఉదయాన్ని వత్తులు వేసి.. అరటి దొప్పలులో దీపం పెడతారు. అలా భగవంతుడిని కోలుస్తారు. హరిహరులకు కార్తీకమాసం ప్రీతకరమైంది. మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటిదొప్పలులో దీపాలను వెలిగించి భక్తుల నదులు, పుష్కరిణిలలో వదులుతారు. వీలుకానీ వారు ఇంటి వద్ద బకెట్/ టబ్‌లో వేస్తారు. మహాశివుడు, అమ్మవారికి పూజలు చేస్తున్నారు.

పోలి పాడ్యమి శోభ

పోలి పాడ్యమి శోభ


తెలుగు రాష్ట్రాల్లో పోలి పాడ్యమి శోభ సంతరించుకుంది. ఇవాళ తెల్లవారుజామున మహిళలు దీపం వెలిగించారు. ఇక ఇటు పోతే విశాఖపట్టణం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో గల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పుష్కరిణిలో పోలి పాడ్యమిని పురష్కరించుకొని విశేషంగా భక్తులు తరలి వచ్చారు. సింహాచలం దేవస్థానం కొండ దిగుువను ఉన్న పుష్కరిణిలో ప్రతి ఏటా సాంప్రదాయబధ్ధంగా నిర్వహిస్తున్న కార్తీక పోలి పాడ్యమి ఉత్సవానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల తోపులాటలు లేకుండా చర్యలు తీసుకున్నారు. తెల్లవారుజాము నుంచే మహిళా భక్తులు పుష్కరిణి వద్దకు చేరుకుని పుష్కరిణిలో దీపాలు విడిచి పోలికి వీడ్కోలు పలుకుతూ పూజలు నిర్వహించారు.

అత్తకు కంటగింపు

అత్తకు కంటగింపు

కార్తీకమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చేది 'పోలి స్వర్గం' ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏంటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. పోలి స్వర్గం తెలుగింటి మహిళ కథ. కార్తీకంలో దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ తెలియజేస్తుంది. పూర్వం కృష్ణాతీరంలో గల ఓ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారిలోని చిన్నకోడలే పోలి. ఆమెకు చిన్నతనం నుంచే పూజలు, దేవుడు అంటే ఎనలేని భక్తి. కానీ అదే భక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా మారింది.

అయినా దీపం వెలిగించి

అయినా దీపం వెలిగించి

మహా భక్తురాలు వేరొకరు లేరని, ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం అత్తకు ఉండేది. కార్తీకమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను వెంటబెట్టుకుని నదికి వెళ్లి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగొచ్చేది. కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో అవసరమైన సరంజామా ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్తపడేది. పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు. పెరడు లోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తి చేసి, కవ్వానికి ఉన్న వెన్నను దానికి రాసి దీపాన్ని కోడలు వెలిగించేంది.

కనిపించకుండా చర్యలు

కనిపించకుండా చర్యలు


ఆ దీపం కూడా ఎవరి కంటా పడకుండా దానిపై మేదరబుట్టను బోర్లించేంది. ఇలా కార్తీకమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి మార్గశిర అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీకం చివరి రోజు కాబట్టి ఆ నాడు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది. పోలి ఎప్పటిలాగే ఇంటిపనులు చకచకా ముగించి, కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవాంతరాలు ఎదురై, ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చపడ్డారు. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పవిమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్త, ఆమె మిగతా కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి నిర్ఘాంతపోయ్యారు.

పోలికి మాత్రమే..

పోలికి మాత్రమే..

ఆమెతోపాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసుందని చెబుతూ వారిని కిందకి దింపారు. తెలుగునాట మహిళలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తల్చుకుంటారు.

30 వత్తులు

30 వత్తులు


కార్తీకమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున 30 వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే.... ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని లేదా స్వయంపాకాన్ని దానం చేస్తారు. తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మీ రూపంగా భావిస్తుంటారు. కాబట్టి చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు.

English summary
poli padyami celebrations at telugu states and simhachalam temple. devotees offer prayers today early morning
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X