నా బ్యూటీ సీక్రెట్ రహస్యం అదే.. అసలు విషయం బయటపెట్టిన తెలుగు హీరోయిన్

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి రెజీనా కసాండ్రా. 'శివ మనసులో శ్రుతి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల తార, ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. 'ఎస్‌ఎంఎస్' నుంచి 'పిల్ల నువ్వు లేని జీవితం', 'రారా కృష్ణయ్య', 'జోరు', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'ఎవరు', 'రాకెట్రీ' వంటి వైవిధ్యభరితమైన సినిమాలతో తన నటనలో పరిణితిని చాటుకుంది.

గ్లామరస్ పాత్రలే కాదు, కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ, నేటి తరం నటీమణులకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. రెజీనా కేవలం నటిగా మాత్రమే కాకుండా, ఫిట్‌నెస్ , ఆరోగ్య విషయంలో కూడా ఎంతో చైతన్యవంతంగా ఉంటారు. తన బిజీ షెడ్యూల్‌లో కూడా యోగా, డైట్, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. ఇదే క్రమంలో, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తూ.. శ్రీకాకుళం నగరంలోని పాండురంగ వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రముఖ హెల్త్‌కేర్ బ్రాంచ్‌ను హీరోయిన్ రెజీనా కసాండ్రా తన కీర్తి కిరీటంలో మరో మెరుగులా ప్రారంభించారు.

Regina Cassandra Reveals Her Beauty Secret Healthy Lifestyle is the Key to Glow Full Details

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టపడతాను, ముఖ్యంగా వెజిటబుల్స్‌కు ప్రాధాన్యత ఇస్తాను. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, అధిక ఆలోచనలను దూరం చేసుకోవడమే అందమైన, ఆరోగ్యకరమైన జీవితానికి రహస్యం అని వెల్లడించారు. 22 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ఆ హెల్త్‌కేర్ సంస్థ.. ఇప్పుడు తన 53వ బ్రాంచీని శ్రీకాకుళంలో ప్రారంభించడం పట్ల యాజమాన్యం ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. మొత్తానికి, ఒకవైపు వెండితెరపై తన నటనతో అలరిస్తూనే, మరోవైపు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు రెజీనా కసాండ్రా శ్రీకాకుళంలో సందడి చేయడం స్థానికులను, ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

రెజీనా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగులో 'కైవల్య' అనే చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో 'మూకుతి అమ్మన్ 2', 'ఫ్లాష్ బ్యాక్' 'కల్లపార్ట్' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే ఆమె ఒక కొత్త తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు.ఇది 'మేర్ ఆఫ్ ఈస్ట్‌టౌన్' స్ఫూర్తితో తెరకెక్కుతోంది. బాలీవుడ్‌లో మధుర్ భండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది వైవ్స్' చిత్రంతో పాటు 'సెక్షన్ 108' అనే మూవీలో ఆమె కీలక పాత్రల్లో నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో అమ్మడు బిజీ బిజీగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+