వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

wife and husband relationship: భార్యాభర్తల మధ్య గొడవలకు ముఖ్యకారణాలివే.. వీటి విషయంలో జాగ్రత్త!!

|
Google Oneindia TeluguNews

ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న చిన్న మనస్పర్ధలకే నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితి వస్తుంది. ఇక విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు ఆందోళనకరంగా పెరుగుతోంది. భార్యా భర్తల మధ్య సఖ్యత లోపించడానికి అసలు కారణం ఏంటి? ఎక్కడ భార్యాభర్తలు సర్దుకోలేకపోతున్నారు? ఎందుకు కలిసి జీవితాన్ని సాగించలేకపోతున్నారు? వంటి అనేక విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

పిల్లలు గొప్పగా చదవాలని ఈ పనులు చేస్తున్నారా? అయితే వారిని మీరు ప్రమాదంలోకి నెడుతున్నట్టే!!పిల్లలు గొప్పగా చదవాలని ఈ పనులు చేస్తున్నారా? అయితే వారిని మీరు ప్రమాదంలోకి నెడుతున్నట్టే!!

అర్ధం చేసుకునే గుణం లేకుంటే వివాహ బంధం కష్టమే

అర్ధం చేసుకునే గుణం లేకుంటే వివాహ బంధం కష్టమే


భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడానికి ప్రధానమైన కారణాలుగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. భార్య భర్తల మధ్య ఒకరిని ఒకరు అర్థం చేసుకునే స్వభావం లేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. భార్య మనస్తత్వాన్ని భర్త, భర్త మనస్తత్వాన్ని భార్య అర్థం చేసుకొని తదనుగుణంగా నడుచుకోకపోవటం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నేనే ఎందుకు నిన్ను అర్ధం చేసుకోవాలి అని ఇద్దరూ అనుకుంటే వివాహ బంధం ముందుకు సాగదు.

ఒకరిపై ఒకరికి గౌరవం ఉండకుంటే నష్టమే

ఒకరిపై ఒకరికి గౌరవం ఉండకుంటే నష్టమే


ఒకరి అభిప్రాయాలకు ఒకరు గౌరవం ఇచ్చి, ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకొని, ఒకవేళ భాగస్వామి అభిప్రాయాలు నచ్చకపోతే, వాటిని మార్చుకునేలా నిదానంగా చెబుతూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయత్నం జరగకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్న క్రమంలోనే భార్యాభర్తల మధ్య ప్రధానంగా సఖ్యత లోపిస్తుంది. దీంతోనే గొడవలు ప్రారంభమవుతున్నాయి. ఫలితంగా కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది.

 నిర్లక్ష్యంగా ఉంటే భార్యాభర్తల మధ్య పెరిగేది దూరమే

నిర్లక్ష్యంగా ఉంటే భార్యాభర్తల మధ్య పెరిగేది దూరమే


భార్య భర్తల మధ్య సఖ్యత లోపించడానికి మరొక ప్రధానమైన కారణం. కుటుంబ భాగస్వామిని పట్టించుకోవడంలో చూపించే నిర్లక్ష్యం. భార్య భర్త కోసం, భర్త భార్య కోసం సమయాన్ని కేటాయించాలి. అలా సమయాన్ని కేటాయించలేకపోవడమే భార్య భర్తల మధ్య మనస్పర్థలకు కారణం అవుతుంది. సమయాన్ని కేటాయించి, ఒకరిపై ఒకరు నిర్లక్ష్య ధోరణి లేకుండా ప్రవర్తిస్తే భార్య భర్తలు కలిసి మెలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది.

 సమయాన్ని కేటాయించకపోతే గ్యాప్ పెరిగే ఛాన్స్

సమయాన్ని కేటాయించకపోతే గ్యాప్ పెరిగే ఛాన్స్


ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తమ కోసం ఒక సమయాన్ని కేటాయించుకుని, ఆ సమయంలో భార్య భర్తలు మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకోవాలి. ఒకరికి ఒకరు అర్ధమయ్యేలా చెప్పుకోవాలి. కానీ ఆ ప్రయత్నం జరగడం లేదు. ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించక పోవడం కూడా భార్యాభర్తల మధ్య దూరాన్ని మరింత పెంచి వారు విడిపోవడానికి కారణం అవుతుంది.

 ఆధిపత్య ధోరణితో సంసారంలో మనస్పర్ధలు

ఆధిపత్య ధోరణితో సంసారంలో మనస్పర్ధలు


భార్య భర్తల మధ్య సఖ్యత లోపించడానికి మరొక ప్రధానమైన కారణం ఆధిపత్య ధోరణి. ప్రస్తుత సమాజంలో ఆడ, మగ ఇద్దరూ కుటుంబం కోసం సంపాదిస్తున్నారు. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్న భార్యలు కూడా చాలామంది ఉన్నారు. ఇక భార్య భర్తలు ఎంత సంపాదించినా, ఏ ఉద్యోగాలు చేసినా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం తాలూకు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించకూడదు. ఇద్దరూ కలిసి మెలిసి ఉండడానికి ప్రయత్నించాలి.

 సర్దుకుపోయే తత్వం, సహనం లేకపోవటమూ వైవాహిక బంధానికి నష్టం చేసేవే

సర్దుకుపోయే తత్వం, సహనం లేకపోవటమూ వైవాహిక బంధానికి నష్టం చేసేవే


సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉన్న పనులలో కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఒకవేళ ఒకరికి ఒకరు సహాయం చేయకపోయినా సర్దుకుపోయే ధోరణి భాగస్వాములలో ఉండాలి. తమకు సహాయం చేసేలా భాగస్వామిని మార్చుకునే సహనం కూడా ఉండాలి. కాస్త కూడా సహనం లేకపోవడం, సర్దుకుపోయే ధోరణి లేకపోవడం, ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం వంటి అనేక కారణాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణంగా మారుతున్నాయి. ఫలితంగా చాలామంది వివాహ బంధాలకు కూడా సింపుల్ గా బ్రేకప్ చెబుతున్నారు.

English summary
Not being able to understand each other, not being able to allocate time, dominantion can be said to be the important reasons for quarrels between husband and wife. If you are careful about these three things, the bond between husband and wife will be strong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X