వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే.. దాంపత్యజీవితం సంతోషంగా ఉండాలంటే ఈ 4సూత్రాలు పాటించండి!!

|
Google Oneindia TeluguNews

భార్యాభర్తల మధ్య ఆనందమైన వాతావరణం ఉండాలంటే, దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే కొన్ని ముఖ్యమైన సూత్రాలను భార్యాభర్తలు పాటించాలి. కొన్ని ముఖ్యమైన లక్షణాలను భార్యాభర్తలిద్దరూ కలిగి ఉండాలి. అప్పుడే వారి జీవితం ప్రేమానురాగాలతో, సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు. ఇంతకీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండటానికి కావాల్సిన ముఖ్య లక్షణాలు ఏంటి? వారు పాటించాల్సిన దాంపత్య సూత్రాలు ఏంటి ? అంటే

భార్యాభర్తల దాంపత్యానికి కావాల్సిన మొదటి సూత్రం ఇదే

భార్యాభర్తల దాంపత్యానికి కావాల్సిన మొదటి సూత్రం ఇదే


భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. భార్య భర్తలు ఎప్పుడు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. భర్త యొక్క స్వభావం, భర్త ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఏం మాట్లాడుతాడు ఏంటి అన్ని విషయాలపై భార్యకు అవగాహన ఉండాలి. భర్త ఇష్టాయిస్టాలకు భార్య ప్రాధాన్యత ఇవ్వాలి. భర్త పైన భార్యకు అంతే సంపూర్ణ విశ్వాసం కూడా ఉండాలి. ఇక అలాగే భార్య పైన కూడా భర్తకు పూర్తి నమ్మకం ఉండాలి. తన భార్య స్వభావం ఏంటి? ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది? వంటి అన్ని విషయాలపై భర్తకు కూడా అవగాహన ఉండాలి. ఆమె ఇష్టాయిస్టాలకు భర్త ప్రాధాన్యత ఇవ్వాలి. భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి సంపూర్ణంగా అవగాహన ఉన్నప్పుడు, ఒకరిపై ఒకరికి బలమైన విశ్వాసం కలుగుతుంది. ఈ బలమైన విశ్వాసమే భార్యాభర్తల బంధానికి బలమైన పునాదిగా మారుతుంది. వారి దాంపత్య జీవితం సుఖంగా సాగడానికి సోపానం అవుతుంది.

భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే పాటించాల్సిన రెండో సూత్రం ఇదే

భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే పాటించాల్సిన రెండో సూత్రం ఇదే


భార్య భర్తల మధ్య అనుబంధం గట్టిగా ఉండాలంటే పాటించాల్సిన మరొక సూత్రం. ఒకరిపై ఒకరు గౌరవాన్ని కలిగి ఉండటం. భార్యాభర్తలిద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి. ఒకరిపై ఒకరు తమ గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి. ఇతరుల వద్ద భర్తను కించపరిచేలా భార్య, భార్యను కించపరిచేలా భర్త ఎప్పుడు ప్రవర్తించకూడదు. భార్యాభర్తలు ఇరువురూ తమ భాగస్వామి యొక్క వ్యక్తిత్వాన్ని అగౌరపరిచేలా ప్రవర్తించకూడదు. భార్య భర్తల ఇద్దరి మధ్య సంపూర్ణ గౌరవం ఉంటే భార్య భర్తల బంధం మరింత బలంగా ఉంటుంది.

భార్యాభార్తలిద్దరికీ వర్తించే ముఖ్య సూత్రం సర్దుకోపోతేనే సాఫీగా సంసారం

భార్యాభార్తలిద్దరికీ వర్తించే ముఖ్య సూత్రం సర్దుకోపోతేనే సాఫీగా సంసారం


భార్యాభర్తల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉండాలంటే భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండాలని చెబుతున్నారు పెద్దలు. భార్యాభర్తల మధ్య దాపరికాలు లేకుండా ప్రతి విషయాన్ని చర్చించుకునే స్వభావం ఉండాలని చెబుతున్నారు. ఒకరిపై ఒకరు నీకంటే నేనే ఎక్కువ అనే ధోరణిని విడనాడి, దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు. ఆర్ధిక విషయాలలో కూడా ఒకరికి ఒకరు బాసటగా ఉండాలని అంటున్నారు.

అర్ధం చేసుకుని ఒకరికి ఒకరుగా ఉంటేనే దాంపత్యానికి అర్ధం

అర్ధం చేసుకుని ఒకరికి ఒకరుగా ఉంటేనే దాంపత్యానికి అర్ధం

ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉండటం, ఒకరి కష్టాన్ని ఇంకొకరు అర్థం చేసుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం భార్య భర్తల మధ్య ప్రేమ బలపడడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అని చెబుతున్నారు. ప్రేమను వ్యక్తం చేస్తేనే అర్ధం అవుతుంది కాబట్టి ప్రేమ వ్యక్తీకరణ ఇద్దరిలోనూ ఉండాలని చెప్తున్నారు. అనేక విషయాల్లో భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆలోచనల సారూప్యత లేకపోయినా, ఒకరినొకరు అర్థం చేసుకుని ఇరువురి వ్యక్తిత్వాలకు గౌరవం ఇచ్చి దాంపత్య జీవితాన్ని అర్థవంతంగా సాగించాల్సిన అవసరం ఉంది. అర్ధం చేసుకోవటంలో, సర్దుకుపోవటంలో సంసారం సాఫీగా, ఆనందదాయకంగా సాగటానికి అవకాశం ఉంటుంది.

wife and husband relationship: భార్యాభర్తల మధ్య గొడవలకు ముఖ్యకారణాలివే.. వీటి విషయంలో జాగ్రత్త!!wife and husband relationship: భార్యాభర్తల మధ్య గొడవలకు ముఖ్యకారణాలివే.. వీటి విషయంలో జాగ్రత్త!!

English summary
Trust, respect, adjustment and understanding are the main principles for love to grow between husband and wife.. for a happy married life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X