Ganesh Chaturthi 2022:వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఈ గణపయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి..?
ఈ నెల ఆగస్టు 31న వినాయక చవితి. భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థినాడు గణపతి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఇక అదే సమయంలో అన్ని ఇళ్లల్లో మంటపాల్లొ లంబోదరుడు కొలువుదీరుతాడు. పదిరోజుల పాటు పూజలందుకున్న వినాయకుడిని 11వ రోజు నిమజ్జనం చేస్తారు. పురాణాల ప్రకారం హిందువులు ముందుగా పూజించే దేవుడు వినాయకుడు కావడం విశేషం. నిత్యం వినాయకుడికి పూజలు అందే చోట రిద్ధి-సిద్ధి మరియు ఐశ్వర్యం ఉంటుందనే నమ్మకం ఉంది. వాస్తు దోషాల నివారణకు, ఇంట్లో శాంతి ఆనందం ఉండాలని కోరుతూ ముందుగా తొలి పూజ బొజ్జ గణపయ్యకే చేస్తారు.
వెర్మిలియన్ కలర్‌లో ఉన్న గణపతిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయట. సుఖశాంతులు సౌభాగ్యాలు కోరుకునే వారు తెల్లటి రంగు ఉన్న వినాయక విగ్రహాన్ని ఇంట్లో ఉంచాలి. నిద్రిస్తున్న వినాయకుడు లేదా కూర్చుని ఉన్న భంగిమలో ఉన్న వినాయకుడిని ఇంట్లో ఉంచే అది శుభ్రప్రదం అని పండితులు చెబుతున్నారు. కళల్లో రాణించాలనుకునేవారు, బాగా చదువుకోవాలని భావిస్తున్నవారు నృత్యం చేస్తున్న వినాయకుడి విగ్రహాన్ని పూజిస్తే ఫలితం ఉంటుంది.

వినాయకుడి తొండం ఎడమవైపునకు తిరిగి ఉండే విగ్రహం ఇంట్లో ప్రతిష్టించాలి. ఇక ఆఫీసుల్లో వినాయకుడి విగ్రహం ఏదైనా ఉంటే అది కచ్చితంగా నిలబడి ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. ఇలా నిలబడి ఉన్న ఏకదంతుడి విగ్రహం ప్రతిష్టించడం వల్ల ఆఫీసుల్లో బాగా పనిచేసేలా ఉత్సాహాన్నిస్తుంది.నిలబడి ఉన్న గణపయ్య రెండు పాదాలు నేలను తాకాలి. ఇలా ఉండటం వల్ల చేసే పనిలో స్థిరత్వం ఉంటుంది.ఇక వక్రతుండ చిత్రాలు ఆఫీసుల్లో ఏ మూలనైనా ఉంచొచ్చు. అయితే ముఖం మాత్రం దక్షిణ దిశలో లేదా ఆగ్నేయ కోణంలో ఉండకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏకదంతుడి విగ్రహం ఉంటే శుభం కలుగుతుంది. వాస్తు దోషాలు తొలగిపోతాయి. నిర్మించిన భవనం ముందు చెట్టు, ఆలయం, స్తంభం, రహదారి వంటివి ఉంటే ఆ ఇంటికి మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఇలా ఉంటే కూర్చున్న భంగిమలో ఉన్న వినాయకుడిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచాలి.












Click it and Unblock the Notifications