గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

13 ఏళ్ల బాలికపై 80 మంది.. 10 నెలలుగా లైంగికదాడి, ఎక్కడ అంటే

|
Google Oneindia TeluguNews

ఆడది కనిపిస్తే కొందరికీ ఏమవుతుందో తెలియదు. నరనరాన కామంతో ఉంటారెమో.. అందుకే చిన్నారులను కూడా వదలడం లేదు. అయితే మైనర్‌పై 80 మంది లైంగికదాడి చేశారు. 10 నెలలుగా రేప్ చేస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గల వ్యభిచార గృహల్లో ఆమెను తింపుతూ.. లైంగికదాడి చేశారు. గతేడాది జూన్‌లో చిన్నారి మిస్సవ్వగా.. ఈ ఏడాది జనవరిలో తొలి అరెస్ట్ జరిగింది. ఏప్రిల్ 19వ తేదీ మంగళవారం గుంటూరులో బ్రోతల్ హౌస్‌లో రైడ్ చేయడంతో.. అష్టదిగ్బందనం నుంచి చిన్నారి విడుదలయ్యింది.

తల్లికి కరోనా.. మరణం..

తల్లికి కరోనా.. మరణం..

గత ఏడాది జూన్ బాలిక తల్లికి కరోనా సోకింది. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరింది. సవర్ణ కుమారి కూడా ఆసుపత్రిలో చేరింది. బాలిక తల్లిని పరిచయం చేసుకుంది. చిన్నారిని దత్తత తీసుకుంటానని కబుర్లు చెప్పింది. అయితే ఆగస్టులో ఆ చిన్నారి తల్లి చనిపోయింది. తండ్రి మాత్రం ఉన్నాడు. కానీ అతనికి చెప్పకుండా బాలికను సవర్ణ తీసుకెళ్లిపోయింది.

ఆమె కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి జనవరిలో తొలి అరెస్ట్ చేశారు. మంగళవారం (ఏప్రిల్ 19వ తేదీ) గుంటూరు బ్రోతల్ హౌస్ నుంచి చిన్నారిని కాపాడారు.

సవర్ణ.. ఏం పని ఇదీ

సవర్ణ.. ఏం పని ఇదీ

ప్రధాన నిందితురాలు సవర్ణ కుమారిని అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ విద్యార్థితో సహా మరో 10 మందిని అరెస్టు చేశారు. నిందితులు, బాధితురాలిని విచారించిన తర్వాత పోలీసులకు ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ వచ్చింది. గత ఎనిమిది నెలలుగా మైనర్ బాలికను ఏపీ, తెలంగాణలోని వేర్వేరు వ్యభిచార గృహాలకు పంపించినట్టు విచారణలో తేలింది. చిన్నారి వయసు, ఆమె కుటుంబ పరిస్థితిని ఆసరాగా తీసుకుని 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారని ఏఎస్పీ సుప్రజ వెల్లడించారు.

80 మంది ఇలా..

80 మంది ఇలా..

80 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, కాకినాడల్లో అదుపులోకి తీసుకున్నారు. 53 సెల్ ఫోన్లు, మూడు ఆటోలు, బైకులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఓ నిందితుడు ప్రస్తుతం లండన్‌లో ఉండగా.. అతడిని రప్పించేందుకు చర్యలు చేపట్టారు. సవర్ణ కుమారిపై కేసు నమోదు చేశారు.

సవర్ణ కుమారి ఒక్కరేనా..?

సవర్ణ కుమారి ఒక్కరేనా..?

పాపం చిన్నారి.. ఆ వయస్సులో ఏం చేయాలో తెలియదు. కానీ ఆమెపై రాక్షసంగా ప్రవర్తించారు. నెలకో వ్యభిచార గృహానికి మార్చేవారు. దీంతో ఆ చిన్నారి నరకయాతన అనుభవించింది. చివరికీ దేవుడు కరుణించడంతో బయటపడింది. తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు తెలియజేయా.. విస్తుపోయారు. సవర్ణ కుమారిపై ఫోకస్ చేశారు. ఆమె ఒక్క చిన్నారినే తీసుకెళ్లిందా.. మరెవరు అయినా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు బ్రోతల్ హౌస్‌పై జరిపిన రైడ్‌లో చిన్నారికి మాత్రం విముక్తి కలిగింది.

English summary
bizarre incident happened in telugu states. 13 years old Girl raped by 80 men. guntur police arrested culprits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X