గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Loan App: ఆగని లోన్ యాప్ వేధింపులు.. భయంతో వివాహిత ఏం చేసిందంటే..

|
Google Oneindia TeluguNews

పోలీసులు కేసులు పెట్టినా.. అరెస్టులు చేసినా.. రుణ యాప్ ల వేధింపులు మాత్రం ఆగడం లేదు. ఇలా రుణ యాప్ ల వేధింపులతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా ఓ మహిళ లోన్ యాప్ ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష అనే వివాహిత ఇండియన్‌ బుల్స్‌, రూపెక్స్‌ యాప్స్‌ల్లో రూ.20,000 లోన్‌ తీసుకుంది.

రూ.20 వేలకు రూ.2 లక్షలు

రూ.20 వేలకు రూ.2 లక్షలు


రుణాలు ఇచ్చేటప్పుడు తక్కువ వడ్డీ అంటే చెప్పే నిర్వాహకులు ప్రత్యూష దగ్గర రూ.20 వేల రుణానికి దాదాపు రూ. 2 లక్షల వరకు వసూలు చేశారు. దాదాపు రూ. లక్ష 80 వేలు ఎక్కువ కట్టించుకున్నా వారు ఇంకా డబ్బులు కట్టాలని బెదిరించారు. లేకుంటే ప్రైవేటు ఫోటోలు సోషల్‌ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. బంధువులకు ఫోన్ చేసి పరువు తీస్తామని ఆందోళనకు గురి చేశారు.

ఫ్లెక్సీ హోర్డింగ్‌కు

ఫ్లెక్సీ హోర్డింగ్‌కు


సోషల్ మీడియాలో అసభ్యకర మెసెజ్‌లు పంపుతూ ఆవేదనకు గురిచేశారు. ఏం చేయాలో.. ఎవరికి చెప్పాలో తెలియక మనస్తాపం చెందిన ప్రత్యూష ఇంటిపైన ఉన్న ఫ్లెక్సీ హోర్డింగ్‌కు చీరతో ఉరేసుకొని బలన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకుని తల్లిదండ్రులు, భర్తకు పంపింది. భర్త వెంటనే ఇంటికి రాగా ప్రత్యూష ఇంట్లో లేదు.

వేధింపులు ఉంటే ఫిర్యాదు చేయాలి

వేధింపులు ఉంటే ఫిర్యాదు చేయాలి


భవనం పైకి వెళ్లి చూసేసారికి ఆమె ఫ్లెక్సీ హోర్డింగ్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన భార్య మరణానికి లోన్ యాప్ వేధింపులే కారణమని మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రుణా యాప్ ల నుంచి లోన్ తీసుకొవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తీసుకుంటే, వారు మిమ్మల్ని వేధింపులకు గురి చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

English summary
dec: A marriede woman commited suicide due the loan apps harassment at guntur in Andrapradhesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X