గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరు అర్బన్‌ ఎస్పీగా బాలుడు- క్యాన్సర్‌ బాధిత చిన్నారికి పోలీసుల గిఫ్ట్‌

|
Google Oneindia TeluguNews

దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు తమ జీవితంలో నెరవేర్చుకోలేని కోరికలను ప్రభుత్వం, పోలీసులు మన్నించడం ఇప్పటికే సినిమాలతో పాటు రియల్‌ లైఫ్‌లోనూ చూసే ఉంటాం. సరిగ్గా ఇదే కోవలో గుంటూరు జిల్లా పోలీసులు కూడా క్యాన్సర్ బాధిత చిన్నారి కోరికను మన్నించి ప్రశంసలు అందుకున్నారు.

గుంటూరు జిల్లాకు చెందిన రిహాన్‌కు క్యాన్సర్‌ సోకింది. ఇప్పటికే చికిత్స తీసుకుంటూనే కాలం గడిపేస్తున్నాడు. అయితే తనకు పోలీసు బాస్‌గా పనిచేయాలని కోరిక ఉంది. ఈ విషయాన్ని అతని తల్లితండ్రులు నోయెల్ చాంద్, బీబీ నూర్జహాన్‌ జిల్లా పోలీసు అధికారుల వద్దకు తీసుకెళ్లారు. దీంతో వారు కూడా సరేనన్నారు. ఇంకేముందు గుంటూరు అర్బన్ ఎస్పీగా రిహాన్‌కు కాసేపు బాధ్యతలు అప్పగించారు. రిహాన్‌ను గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి స్వయంగా తన ఛైర్‌లో కూర్చోబెట్టి కాసేపు విధులు నిర్వర్తించేందుకు సహకరించారు.

cancer victim child rihan performs guntur urban sp duties for a while to make his wish

తమ చిన్నారి ముఖంలో నవ్వులు చూసి వారి తల్లిదండ్రులు కూడా మురిసిపోయారు. క్యాన్సర్‌ బాధిత బాలుడు రిహాన్‌ కోరిక నెరవేర్చడంతో అతనితో పాటు తల్లితండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారుడి కోరిన తీర్చినందుకు పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు క్యాన్సర్ బాథిత బాలుడి కోరికను మన్నించిన గుంటూరు అర్బన్ పోలీసులపైనా ప్రశంసల వర్షం కురుస్తోంది. విషయం తెలిసి నగరానికి చెందిన పలువురు పోలీసులను అభినందించారు. సామాజిక బాధ్యతను నెరవేర్చేందుకు పోలీసులు ముందుకు రావడం మంచి పరిణామమని చెప్తున్నారు.

English summary
guntur police officials to handover superintendent of police duties to cancer victim child rihan for a while to fulfil his wish today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X