గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాడుతో ఉరి వేసుకొనే కోడెల ఆత్మహత్య..!! 15 రోజుల క్రితం నిద్రమాత్రలతో అదే ప్రయత్నం: అసలేం జరిగింది.

|
Google Oneindia TeluguNews

మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య చుట్టూ అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. కోడెల ఎలా మరణించారు. కొందరు ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని..మరి కొందరు గుండెపోటు అని చెబుతన్న సమయంలో ఆప్పత్రి నుండి అధికారిక బులెటిన్ విడుదల కాలేదు. అయితే..ఆస్పత్రి నుండి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఇది బలవన్మరణంగా చెబుతున్నారు. దీంతో..కోడెల భౌతిక ఖాయాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా అస్పత్రికి తరలించారు. కాగా.. విచారణ కోసం కోడెల ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఎవరూ లేకపోవటంతో పోలీసులు గోడ దూకి ఇంట్లోకి వెళ్లారు. అక్కడ కోడెల ఆత్మహత్య చేసుకొనే ముందు ఏమైనా లేఖ రాసారా అని శోధిస్తున్నారు. ఆయన తన గది తలుపులు తీయకపోవటంతో వాటిని బద్దలుకొట్టి బసవతారకం ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. అయితే పోస్టు మార్టం నివేదిక వస్తే గానీ కోడెల ఎలా మరణించా రనే విషయం పైన స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే.. ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడటానికి దారి తీసిన కారణాల పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. కోడెల ఉదయం బట్టలు ఆరేసే తాడుతో ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య

బట్టలు ఆరేసే తాడుతో ఉరేసుకొని కోడెల...
కొద్ది రోజులు కుటుంబలోనూ..రాజకీయంగానూ జరుగుతున్న పరిణామాలతో కోడెల తీవ్రంగా మానసిక వ్యధకు గురయ్యారు. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో ఆయన కుమారుడి షోరూంలో ఫర్నీచర్ ను అసెంబ్లీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన స్వల్ప గండెపోటుకు గురయ్యారని..అందుకే ఆస్పత్రిలో చికిత్స సొందుతున్నారని చెప్పిన విషయం నిజం కాదని తేలింది. ఆయన అప్పటికే మానసిక వ్యధతో నిద్ర మాత్రలు మింగారని సమాచారం. దీంతో..కోడెలను ఆయన అల్లుడు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందించారు. అది జరిగిన తరువాత తన కుటుంబ సభ్యుల పైన కేసులు..మానసిక వేధింపులు తట్టుకోలేక పోయారు. తాను పులిలా బతికానని ఈ అవమానాలు తట్టుకోలేకపోతున్నానంటూ కోడెల పలువురి వద్ద వాపోయినట్లు సమాచారం. గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్లిన కోడెల ఈ రోజు ఉదయం 7.30 గంటలకు బట్టలు ఆరేసే తాడుతో ఉరి వేసుకొని కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది.. ఎంత సేపటికి కోడెల తలుపులు తీయకపోవటంతో..ఆయన సెక్యూరిటీ గార్డు..డ్రైవరు వెంటనే తలుపులు బద్దలు కొట్టి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అప్పటికే కోడెల మరణించారు. దీంతో..పోలీసులకు ఆస్పత్రి సిబ్బంది సమాచారం అందించారు.

Kodela Siva Prasad hanged with wire in his room and committed suicide

కోడెల నివాసానికి పోలీసులు..
కోడెల ఆత్మహత్య చేసుకొని మరణించటంతో విచారణ కోసం పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ గేటు వేసి ఉండటంతో గోడ దూకి పోలీసులు లోపలకు వెళ్లారు. కోడెల గతి తలుపులు బద్దలు కొట్టి ఉండటంతో ఆత్మహత్యకు ముందు ఆయన ఏదైనా లేఖ రాసారా అనే కోణంలో శోధిస్తున్నారు. అయితే, ఆయన ఉదయం ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు ఆదివారం ఎవరిని కలిసారు..ఫోన్ లో ఎవరితో మాట్లాడారు..వారికి ఏం చెప్పారనే కోణంలో విచారణ మొదలు పెట్టారు. ఆత్మహత్య కావటంతో బసవ తారకం ఆస్పత్రి కోడెల భౌతిక కాయాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించింది. పోస్టు మార్టం నివేదిక ఆధారంగా పూర్తి సమాచారం తెలుస్తుంది పోలీసులు చెబుతున్నారు. అయితే..జరుగుతున్న అవమానాలు తట్టుకోలేకనే కోడెల తాడుతో ఉరి వేసుకొన్నారని చెబుతున్నారు. పది హేను రోజుల క్రితమే ఆయన ఆత్మహత్య చేసుకోవటానికి నిద్ర మాత్రలతో ప్రయత్నించినా.. సకాలంలో కుటుంబ సభ్యులు అప్రమత్తం కావటంతో ప్రమాదం తప్పింది. అయితే, ఇప్పుడు ఆయన మరోసారి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోవటంతో కుటుంబ సభ్యులనున సైతం విచారించటానికి పోలీసులు సిద్దమయ్యారుద.

English summary
Kodela Siva Prasad hanged with wire in his room and committed suicide. sources said 15 days back also kodela tried for suicide in Guntur. Police started investigation in his house and relatives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X