వైసిపి సెక్షన్ కింద బులుగు ఖాకీలు మాస్కు పెట్టుకోని జగన్ రెడ్డికి ఏ శిక్ష విధిస్తారు : లోకేష్ ఫైర్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. దళితులంటే సీఎం జగన్ రెడ్డికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించిన నారా లోకేష్ చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ ను మాస్కు లేదని వైసిపి పోలీసులు కొట్టి చంపి ఏడాదయ్యింది అంటూ ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. నిందితులైన పోలీసులపై ఇప్పటివరకు ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని, దళితులపై ఎందుకింత వివక్ష సీఎం జగన్ గారు అంటూ ప్రశ్నించారు నారా లోకేష్.

ఇదే సమయంలో కిరణ్ కుమార్ ను పోలీసులు కిరాతకంగా చంపారని తల్లి , తండ్రి , చెల్లెళ్ళని కంటికి రెప్పలా చూసుకున్న కిరణ్ కుమార్ ను కిరాతకంగా చంపడానికి మనసెలా ఒప్పింది? అంటూ జగన్ ను లోకేష్ ప్రశ్నించారు. అంతేకాదు జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో దళితులకు బతికే హక్కు లేదా అంటూ నారా లోకేష్ నిలదీశారు. మాస్క్ పెట్టుకోకపోవడం నేరమైతే, వైసిపి సెక్షన్ కింద దళిత యువతేజం కిరణ్ కుమార్ ని హత్య చేసిన బులుగు ఖాకీలు, రోజు మాస్కు పెట్టుకోని జగన్ రెడ్డికి ఏ శిక్ష విధిస్తారు అంటూ నిలదీశారు నారా లోకేష్.

Lokesh questions What punishment will be given to Jagan Reddy for not wearing a mask

Recommended Video

    The TDP ranks anointed Nara Lokesh as a great leader | Oneindia Telugu

    ఈ హత్య వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు జరపాలని ఇప్పటికైనా కిరణ్ కుమార్ హత్యకు కారకులైన ఎస్సై, కానిస్టేబుల్స్ ను తక్షణమే శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు లోకేష్. ఓ కుటుంబానికి తీరని శోకం మిగిల్చి, జీవనాధారమైన చెట్టంత కొడుకుని కబళించిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ కుటుంబానికి యాభై లక్షల పరిహారం ఇవ్వాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక మార్లు టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ మాస్కు పెట్టుకోకపోవడాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు తాజాగా మరోమారు ఫైర్ అయ్యారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+