Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీని తన తాత జాగీర్ లా విర్రవీగుతున్న జగన్ రెడ్డీ .. దమ్ముంటే ఆ పని చెయ్ : జగన్ కు లోకేష్ సవాల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలలో అత్యధిక స్థానాలు వైసిపి కైవసం చేసుకుంటుందని వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటుంటే వైసిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, అయినప్పటికీ టిడిపి హవా కొనసాగుతోందని టిడిపి నేతలు ఎదురుదాడి చేస్తున్నారు .తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపణ

ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపణ

పంచాయతీ ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఎన్నికలలో గెలవాలని సవాల్ విసిరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలలో ఇప్పటివరకు మొదటి, రెండవ దశ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు మూడో విడత ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది . ఈనెల 17వ తేదీన మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అదేరోజు కౌంటింగ్ కొనసాగనుంది. ఇక ఇప్పటి వరకు రెండో విడత ఎన్నికలలోనూ వైసిపి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని నారా లోకేష్ ఆరోపించారు.

 వైసిపి ఎన్ని కుట్రలు చేసినా టిడిపి హవా పంచాయతీ ఎన్నికల్లో కనిపించింది

వైసిపి ఎన్ని కుట్రలు చేసినా టిడిపి హవా పంచాయతీ ఎన్నికల్లో కనిపించింది

వైసిపి ఎన్ని కుట్రలు చేసినా టిడిపి హవా పంచాయతీ ఎన్నికల్లో కనిపించిందని పేర్కొన్న నారా లోకేష్, వచ్చే మూడు నాలుగు విడతల్లో వైసీపీ అధికార దుర్వినియోగం చేయకుండా పోటీచేయాలని సవాల్ విసిరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన తాత జాగీర్ లా విర్రవీగుతున్న జగన్ రెడ్డి వైసిపి మద్దతుదారులు 95 శాతం పంచాయతీలలో ఏకగ్రీవంగా గెలవాలని టార్గెట్ పెట్టారని లోకేష్ వ్యాఖ్యానించారు . అయినప్పటికీ తొలివిడత లోనే తెలుగుదేశం సైన్యం ఎదురొడ్డి పోరాడి జెండా ఎగరేసిందన్నారు.

 రెండో విడతలో వైసిపి పెద్ద తలకాయల పంచాయతీలను సైతం మడత పెట్టింది

రెండో విడతలో వైసిపి పెద్ద తలకాయల పంచాయతీలను సైతం మడత పెట్టింది


రెండో విడతలో వైసిపి పెద్ద తలకాయల పంచాయతీలను సైతం మడత పెట్టింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మూడో విడతలో వైసిపికి మూడిందని తెలుగుదేశం కార్యకర్త నుంచి కార్యదర్శి వరకు వెన్ను చూపని పోరాటంతోనే పంచాయతీలో పట్టు సాధించామంటూ నారా లోకేష్ పేర్కొన్నారు.

టీడీపీ అభిమాని నుండి అధ్యక్షుడు వరకు పడిన కష్టానికి ప్రతిఫలం ఈ సానుకూల ఫలితాలు అంటూ అభిప్రాయపడిన నారా లోకేష్ బెదిరించి ఏకగ్రీవాలు చేసుకోవడం, చంపేస్తామని హెచ్చరించి విత్ డ్రా చేయించడం, ఒక విజయమేనా జగన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.

Recommended Video

    Watch Rahul Gandhi’s Reaction at a Live Event as Earthquake Strikes- Viral
    దమ్ముంటే అధికార దుర్వినియోగం చేయకుండా పోటీకి దిగాలని సవాల్

    దమ్ముంటే అధికార దుర్వినియోగం చేయకుండా పోటీకి దిగాలని సవాల్

    ఇంకా ప్రజలు వైసీపీ వైపు ఉన్నారని మీకు నమ్మకం ఉంటే, దమ్ముంటే అధికార దుర్వినియోగం చేయకుండా మూడు, నాలుగు విడతల్లో పోటీ చేయండి. ఎవరి సత్తా ఏంటో అక్కడే తేలిపోతుంది అంటూ నారా లోకేష్ సవాల్ విసిరారు. ఏదేమైనా పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఎవరికి వారు తామే ఆధిక్యత సాధించామని చెప్పుకోవడం, పట్టు నిలుపుకున్నామంటూ ప్రచారం చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+