గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ సూపర్ ఐడియా.. రూ.5కు బురదలో బిర్యానీ.. మాచర్ల ఘటనలో తప్పు టీడీపీదే..

|
Google Oneindia TeluguNews

ఒక ఐడియా జీవితాలను మార్చుతుంది.. కోట్ల రూపాయల్ని కురిపిస్తుంది.. అయితే ఆ ఫలాలు కేవలం కొందరికే దక్కడం.. అర్హులైనవాళ్లకూ అన్యాయం జరగడం తరచూ చూస్తున్నదేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. అలాంటి ఓ సూపర్ ఐడియాతోనే సీఎం జగన్ రాష్ట్ర ఖజానా నుంచి ఏకంగా రూ.2600 కోట్లు కొల్లగొట్టారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, మాచర్ల దాడి ఘటనలో తప్పు టీడీపీ నేతలదేనని లోకేశ్ అన్నట్లుగా జరుగుతున్న ప్రచారంపైనా ఆయన వివరణ ఇచ్చారు.

లోకేశ్ లాజిక్..

లోకేశ్ లాజిక్..

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు భారీగా చేరికలతో ఊపుమీదున్న అధికార వైసీపీకి హైకోర్టు తీర్పు రూపంలో చిన్న షాక్ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయ భవనాలకు వైసీపీ జెండాలోని మూడు రంగులు వేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. 10 రోజుల్లోగా పాత రంగులు తొలగించాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచన మేరకు కొత్త రంగులు వేసే ప్రక్రియ ప్రారంభమైంది. సరిగ్గా ఇక్కడో లాజిక్ పాయింట్ లేవనెత్తారు నారా లోకేశ్..

వాటెన్ ఐడియా..

వాటెన్ ఐడియా..

గ్రామ సచివాలయాలపై వైసీపీ రంగులు వేసినందుకు రూ.1300 కోట్లు ఖర్చయ్యాయి. కోర్టు తీర్పు తర్వాత కొత్త రంగులు వేయడానికి మరో రూ.1300 కోట్లు ఖర్చవుతాయి. వెరసి రంగుల కోసం రూ.2600 కోట్ల ప్రజాధనాన్ని వేస్టు చేశారని లోకేశ్ ఆరోపించారు. అదే రూ.2600 కోట్లు పెడితే ఏపీలోని డ్వాక్రా మహిళలందరి రుణాలు తీరేవి. డ్వాక్రా రుణాలపై సీఎం తన హామీని విస్మరించారని టీడీపీ నేత మండిపడ్డారు. ‘‘మీ ఇంటికొస్తే ఏమిస్తారు? మా ఇంటికొస్తే ఏం తెస్తారు? అన్న చందరంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. రంగులేస్తే 1300 కోట్లు.. వాటిని తీస్తే మరో 1300 కోట్లు.. వాటెన్ ఐడియా జగన్ జీ..''అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు. ఇక మాచర్ల విషయానికొస్తే..

మాచర్ల దాడి..

మాచర్ల దాడి..

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా టీడీపీ అభ్యర్థుల్ని వైసీపీ అడ్డుకుంటోందన్న సమాచారంతో సీనియర్ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న, లాయర్ మురళిలు బుధవారం మాచర్ల వెళ్లగా.. వారిపై అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. కారును ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. తమను హత్య చేయడానికే వైసీపీ వాళ్లు ప్రయత్నించారని, తృటిలో ప్రాణాలతో బయటపడ్డామని బోండా, బుద్ధా మీడియాకు తెలిపారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని పార్టీ చీఫ్ చంద్రబాబు చెప్పారు. అంతలోనే నారా లోకేశ్ పేరుతో విడుదలైన ఒక ప్రకటన సంచలనం రేపింది...

తప్పు టీడీపీదా?

తప్పు టీడీపీదా?

మాచర్ల ఘటనలో టీడీపీ నేతలు కారుతో పిల్లాడిని గుద్ది వెళ్లడం తప్పేనని, అయినంత మాత్రాన దాడి చేస్తారా? అని లోకేశ్ ప్రశ్నించినట్లు ఆయన అధికార ట్విటర్ లో ప్రకటన వచ్చింది. కానీ అది ఫేక్ ప్రకటన అని, అచ్చం తనలాంటి ట్విటర్ ఐడీతోనే వైసీపీ అనుకూలురు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు.

Recommended Video

Rajya Sabha Polls : TDP Using Dalits For Self Interest | అలా అయితే లోకేశ్‌ రాజ్యసభకు...!!
థూ.. మీ.బ.చె..

థూ.. మీ.బ.చె..

లోకేశ్ ఒరిజినల్ ట్వీట్.. వైసీపీ క్రియేట్ చేసిన ఫేక్ ట్వీట్ మధ్య తేడాను వివరిస్తూ టీడీపీ ఐటీ సెల్ వైసీపీపై విరుచుకుపడంది. ‘‘థూ.. మీ బతుకుచెడ.. 5రూపాయల కోసం బురదలో బిర్యానీ కూడా తినేలా ఉన్నారు''అని మండిపడగా, ఆ సందేశాన్ని రీట్వీట్ చేస్తూ లోకేశ్.. ‘‘సీఎం జగన్ విసిరే ఐదు రూపాయల కోసం వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎంతకైనా దిగజారుతుంది. మార్ఫిండ్ ట్వీట్స్ తో సంబరపడిపోతున్న జఫ్పా బ్యాచ్ కు నా సానుభూతి. ''అని ఫైరయ్యారు.

English summary
as Andhra pradesh high court directs govt to remove YSRCP flag colours from govt buildings in 10 days, tdp leader nara lokesh accused that cm jagan wasted rs.2600 crore in the name of colours
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X