గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు,లోకేష్‌లను వెంటనే అరెస్ట్ చేయాలి.. నాపై దాడి వెనుక వారిద్దరి హస్తం : ఎంపీ సురేష్

|
Google Oneindia TeluguNews

బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై నందిగామలో టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. జై అమరావతి అని నినదించాలంటూ ఆయనపై టీడీపీ కార్యకర్తలు ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ ఎంపీ మాత్రం అన్ని ప్రాంతాల సమ అభివృద్దియే తమ లక్ష్యం అని చాటి చెప్పారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ సురేష్.. తనపై జరిగిన దాడి వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

 చంద్రబాబు,లోకేష్‌ల అరెస్టుకు డిమాండ్..

చంద్రబాబు,లోకేష్‌ల అరెస్టుకు డిమాండ్..

తనపై జరిగిన దాడిపై వెంటనే న్యాయ విచారణ చేసి వారిద్దరిని అరెస్ట్ చేయాలని ఎంపీ సురేష్ డిమాండ్ చేశారు. జగన్ అద్భుతమైన పాలనను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని,అందుకే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంటి వద్దకే పెన్షన్ కార్యక్రమం ప్రారంభమవడంతో.. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

లోకేష్ ఈ జన్మలో ఎమ్మెల్యే కాలేడు..

లోకేష్ ఈ జన్మలో ఎమ్మెల్యే కాలేడు..

ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడితే.. లోకేష్ ఈ జన్మలో ఎమ్మెల్యే కాలేడని విమర్శించారు. చంద్రబాబు,లోకేష్‌లపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో వారు మరిన్ని దారుణాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో తనపై దాడులు జరిగితే.. దానికి వారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

పెయిడ్ ఆర్టిస్టులతో దాడి..

పెయిడ్ ఆర్టిస్టులతో దాడి..

ఎంపీ నందిగం సురేష్‌పై టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్టులతో దాడి చేయించిందని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ఆరోపించారు.దాడికి చంద్రబాబునాయుడు, లోకేష్‌‌లే బాధ్యత వహించాలన్నారు. దళిత ప్రజా ప్రతినిధుల పైకి టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్న చంద్రబాబు, లోకేష్‌లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఓవైపు సురేష్ అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఆయనపై దాడి చేయాలనుకోవడం దారుణమన్నారు. వ్యూహం ప్రకారమే ఆయనపై దాడి చేయించారని నాగార్జున ఆరోపించారు.

కుట్ర జరిగిందన్న ఎమ్మెల్యే మేరుగు నాగార్జున..

కుట్ర జరిగిందన్న ఎమ్మెల్యే మేరుగు నాగార్జున..


ఎంపీ నందిగం సురేష్‌పై దాడి వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు ఎమ్మెల్యే నాగార్జున. వైసీపీ నేతలపై దాడులు చేయడం ద్వారా ఏదో సాధించినట్టు చంద్రబాబు ఫీలవుతున్నారని అన్నారు. రాజధానిలో దళితులను మభ్యపెట్టేందుకే సురేష్‌పై దాడి చేశారని ఆరోపించారు. చంద్రబాబు పరిపాలనలో దళితులు అస్పృశ్యత, అంటరానితనాన్ని ఎదుర్కొన్నారని.. సురేష్‌పై దాడి దళితులపై చంద్రబాబు ఆకృత్యాలకు నిదర్శనమన్నారు. రాజ్యాంగ పరిరక్షణ దిశగా జగన్ పాలన సాగిస్తున్నారని.. దాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని అన్నారు.

English summary
YSRCP MP Suresh demanded immediate probe into the attack and arrest for Chandrababu Naidu,Lokesh. MLA Nagarjuna alleged that MP Nandigam Suresh was attacked by TDP paid artists
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X