
ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్న ఐదేళ్ల బాలుడి పేరు లితీషన్. ఈ బాలుడు పుట్టిన 45 రోజులకు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు కనుగొన్నారు. అయితే ఈ చిన్నారిని ఎలాగైనా కాపాడుకోవాలని భావించిన తల్లిదండ్రులు సంపత్, లావణ్యలు MIOT హాస్పిటల్ గురించి తెలుసుకున్నారు. మియాట్ హాస్పిటల్ గురించి వారి బంధువులు తెలిపారు.
ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మియాట్ హాస్పిటల్‌కు చిన్నారిని తీసుకెళ్లారు. చిన్నారిని పరీశీలించిన వైద్యులు మూడు సర్జరీలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే రెండు సర్జరీలు పూర్తయ్యాయి. ఇక మూడవ సర్జరీ చేయాల్సి ఉంది. ఇక కొడుకు విషయం తెలుసుకున్న తండ్రి సంపత్ తన భార్య నుంచి విడిపోయాడు. వ్యాధి బారిన పడ్డ కొడుకుతో ఉండలేక భార్య లావణ్యకు విడాకులిచ్చేశాడు. గతేడాది నవంబర్‌లో వీరిద్దరికీ విడాకులు మంజూరు అయ్యాయి.

ఇక లావణ్య ఒక్కదానికి కష్టమైపోయింది. బిడ్డను వదిలి ఒక ఉద్యోగం చూసుకోవాలంటే కష్టమైపోయింది. డిగ్రీవరకు చదివిన లావణ్యకు ఉద్యోగం లేదు. ఇల్లు గడవడమే కష్టమైపోయింది. ప్రస్తుతం తను లితీషన్‌తో పాటు తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. లావణ్య తండ్రి పెన్షన్ మీదే ఆ కుటుంబం నెట్టుకొస్తోంది.

రెండవ సర్జరీ కోసం తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తన బంగారును అమ్మి డబ్బులు తీసుకొచ్చింది. ప్రస్తుతం మూడవ సర్జరీకి కావాల్సిన డబ్బులు లావణ్య వద్ద లేవు. చిన్నారికి ఫాంటాన్ సర్జరీ చేయాల్సి ఉంది. దానికి అయ్యే ఖర్చు రూ.3,50,000. సర్జరీ, ఐసీయూ హాస్పిటల్ అడ్మిషన్ తో అంతా కలిసే ఈ మొత్తం అవుతుంది.

ఇక చిన్నారి ప్రాణాలు కాపాడుకోవాలంటే అంత మొత్తంలో డబ్బులు వారిదగ్గర లేదు. ఈ క్రమంలోనే వారు దాతల కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి తమ బిడ్డ ప్రాణాలను కాపాడాలని లావణ్య ఆమె తండ్రి కేశవన్‌లు వేడుకుంటున్నారు. చిన్నారి ప్రాణాలు కాపాడాలంటూ కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఇప్పటికే కొందరు దాతలు సహాయం చేయడం ప్రారంభించారు. మీరు సహాయం చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
RECOMMENDED STORIES