ఈసీ సభ్యుల కౌంటింగ్ పూర్తి : విష్ణు ప్యానల్ లో 10 మంది - ప్రకాశ్ రాజ్ టీం లో 8 మంది విజయం .!!
"మా" ఎన్నికల్లో తొలి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పోస్టల్ బ్యాలెట్ లో విష్ణు ప్యానెల్ ముందంజలో ఉంది. ఇక, ఇప్పుడు ఎగ్గిక్యూటివ్ సభ్యులు ఓట్ల లెక్కింపు పూర్తయినట్లుగా సమాచారం. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేసిన 10 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులు... ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి 8 మంది ఈసీ సభ్యులు గెలుపుకు దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేసిన వారిలో పూజిత, శ్రీలక్ష్మీ, దేవాని, శశాంక్, శ్రీనివాస్, హరినాధ్,జయవాణి, బొప్పన శివ తో సహా మరో ఇద్దరు విజయం సాధించినట్లుగా సమాచారం.

ఈసీ సభ్యుల్ల ఓట్ల లెక్కింపులో హోరా హోరీ
అదే ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి శివారెడ్డి, కౌశిక్, యాంకర్ అనసూయ , సురేష్ కొండేటి తో పాటుగా మరో నలుగురువిజయం సాధించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ ప్యానల్ నుంచి 8 మంది ఆధిక్యతలో ఉన్నారని తెలుస్తోంది. ఈసీ సభ్యుల విషయంలో ఫైట్ ఇంత క్లోజ్ గా ఉండటంతో ఇక, అధ్యక్ష ఓట్ల లెక్కింపు మరింత ఆసక్తి కరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈసీ సభ్యుల ఓట్ల లెక్కింపు పూర్తయినా..ఇంకా ఎన్నికల అధికారులు ఫలితాలు వెల్లడించ లేదు. అన్నీ కలిపే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

భారీగా క్రాస్ ఓటింగ్ తో మరింత ఆందోళన
మిగిలిన ఎగ్జిక్యూటివ్ సభ్యుల ఓట్ల లెక్కింపు సైతం పూర్తయిన తరువాత చివరగా అధ్యక్ష ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ తరువాత అధికారికంగా ఫలితాలను వెల్లడించనున్నారు. ఇందుకు మరో గంటన్నార నుంచి రెండు గంటల సమయం పడుతోందని తెలుస్తోంది. ఉదయం నుంచి టెన్షన్ టెన్షన్ గా కనిపించిన సభ్యులు..ఇప్పుడు కౌంటింగ్ ప్రారంభమైన తరువాత మరింత ఒత్తిడితో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. ప్రకాశ్ రాజ్..విష్ణుతో పాటుగా పోటీలో ఉన్న సభ్యులంతా అదే టెన్షన్ లో కనిపిస్తున్నారు.

కౌంటింగ్ హాల్ లో అంతా ఉత్కంఠ భరితంగా
తీవ్ర పోటీ ఉండటంతో ఎటువంటి ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా మోహన్ బాబు..మురళీ మోహన్... నరేశ్ అక్కడే మకాం వేసారు. ఇక, ప్రకాశ్ రాజ్.. విష్ణు ఇద్దరూ కౌంటింగ్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఇద్దరు గెలవటంతో.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ లోని ఇతర సభ్యులు ఆ ఇద్దరినీ అభినందిస్తున్నారు.
అదే విధంగా ఈసీ మెంబర్ల ఓటింగ్ విషయం లో మాత్రం క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా పోలింగ్ ..కౌంటింగ్ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ముందుకు సాగుతున్న కొద్దీ అభ్యర్ధులతో పాటుగా మద్దతు దారుల్లోనూ టెన్షన్ కనిపిస్తోంది. మోహన్ బాబు..నరేశ్ అక్కడే మకాం వేసి కౌంటింగ్ టెండ్ర్స్ లెక్కలు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications