1061 కేసులు.. నిన్నటికన్నా తక్కువ.. 11 మంది మృతి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,20,397 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,061 మందికి పాజిటివ్ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 135 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 80, సూర్యాపేట జిల్లాలో 67, రంగారెడ్డి జిల్లాలో 66, నల్గొండ జిల్లాలో 65 కేసులు గుర్తించారు.
1,556 మంది కోలుకోగా, 11 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,618కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,18,837 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,99,695 మంది తిరిగి కోలుకున్నారు. ఇంకా 15,524 మందికి చికిత్స జరుగుతోంది.
నిన్న కొత్తగా 1,088 కరోనా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. వైరస్ సోకిన 9 మంది మరణించారు. వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం.

అయితే కొత్తగా డెల్టా వేరియంట్ భయపెడుతుంది. ఏపీలో ఒక కేసు వెలుగుచూసింది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా కేసులు వచ్చాయి. 7 రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. థర్డ్ వేవ్ ముప్పు అని ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో.. డెల్టా వేరియంట్ భయాందోళనను కలిగిస్తోంది.
ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా తీసుకునే అవకాశం ఉంది. నామమాత్ర రుసుం రూ.250 ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. అందరికీ వ్యాక్సిన్ అందజేస్తే కరోనాను జయించడం తేలికే అవుతుంది.












Click it and Unblock the Notifications