Hyderabad: చిన్న వయస్సులోనే పెద్ద మనస్సు.. 3 లైబ్రరీలు నెలకొల్పిన బాలిక..
మనిషికి డబ్బు ఉన్నా లేకున్నా జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం అనేది పుస్తకాల నుంచి వస్తుంది. అందుకే చిరిగిన చొక్కా అయిన వేసుకో కానీ మంచి పుస్తకం కొనుక్కో అని చెబుతారు శ్రీ శ్రీ.. ఆయన మాటలనే ఆదర్శంగా తీసుకున్న ఓ బాలిక చిన్న వయస్సులోనే గ్రంథాయాలను నెలకొల్పింది. ఆకర్షన సతీష్ అనే 11 ఏళ్ల బాలిక హైదరాబాద్‌లో మూడు లైబ్రరీలను ఏర్పాటు చేసింది. ఆమె తన పొరుగువారు, సహవిద్యార్థులు, ఆమె కుటుంబ సభ్యుల నుంచి పుస్తకాలను సేకరించడం ద్వారా గ్రంథాయాలను ప్రారంభించింది.
మొత్తంగా ఆమె పిల్లల కోసం లైబ్రరీలను ఏర్పాటు చేయడానికి ఉపయోగించిన 4,834 పుస్తకాలను సేకరించగలిగింది."కొవిడ్ సమయంలో, నేను కుటుంబ స్నేహితులు, పాఠశాల స్నేహితులు, నా పొరుగువారి నుండి పుస్తకాలను సేకరించాను. నేను మొత్తం 4,800 కంటే ఎక్కువ సేకరించాను" అని ఆకర్షన తెలిపింది. తాను ఇదివరకే రెండు లైబ్రరీలను ఏర్పాటు చేసినట్లు.. ఒకటి MNJ క్యాన్సర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో, మరొకటి సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నెలకొల్పినట్లు చెప్పారు. తన మూడవ లైబ్రరీని కాచిగూడలోని నింబోలియాద్దలోని బాలికల అబ్జర్వేషన్ హోమ్‌లో ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

ఈ లైబ్రరీలో 625 పుస్తకాలను ఏర్పాటు చేశామని.. ఇందులో 425 తెలుగు పుస్తకాలు, 150 ఆంగ్ల పుస్తకాలు, 50 హిందీ పుస్తకాలతో పాటు ఫిక్షన్, నాన్ ఫిక్షన్, జనరల్ నాలెడ్జ్ బుక్ లు ఉన్నాయని తెలిపింది. "నాకు స్ఫూర్తి మా నాన్న. ఆయన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాడు. నేను ఆయన మార్గంలో నడవాలనుకుంటున్నాను " అని ఆకర్షన పేర్కొంది. గ్రంధాలయాలు లేని ప్రదేశాలలో పుస్తకాలను విరాళంగా అందించడం, లైబ్రరీలను సృష్టించడం వంటి ఆలోచనను కలిగి ఉన్న 11 ఏళ్ల హైదరాబాద్‌కు చెందిన ఆకర్షణను తాను అభినందిస్తున్నట్లు ఐపీఎస్ శిఖా గోయల్ తెలిపారు.
ఆమె మా కోసం ఒక లైబ్రరీని సృష్టించింది మరియు ఒక పోలీసు స్టేషన్‌లో దాన్ని ప్రారంభించింది. ఈరోజు హైదరాబాద్‌లోని బాలికల గృహంలో లైబ్రరీని ప్రారంభించారు. ఇది చాలా గొప్ప ఆలోచన, ఇది మనం ఏ చిన్న మార్గంలో చేసినా సమాజానికి తిరిగి ఇవ్వడానికి మనందరికీ స్ఫూర్తినిస్తుందని చెప్పారు. తమ భరోసా కేంద్రంలో ఆమెకు స్థలం కల్పిస్తామని కూడా చెప్పారు. ఆమె త్వరలో మా తదుపరి భరోసా కేంద్రంలో మరో లైబ్రరీని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఆకర్షన నుంచి చాలా మంది ప్రేరణ పొందుతారని ఆశిస్తున్నట్లు వివరించారు.
#Inspiration Akarshana Sathish, a 11-year-old from Hyderabad, has collected 4834 books & set up 2 libraries in Sanath Nagar PS & MNJ Cancer Children Hospital. Encouraged her to set up one in upcoming Bharosa centers. #Yougminds pic.twitter.com/Tvib0irNZR
— Shikha Goel, IPS (@Shikhagoel_IPS) April 20, 2023
"నా కుమార్తె ఈ రోజు తన మూడవ లైబ్రరీని జువెనైల్ హోమ్ ఫర్ గర్ల్స్‌లో స్థాపించింది. ఇది హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రత్యేక హోమ్. ఆమె ఇంగ్లీష్, హిందీ, తెలుగులో 670 కంటే ఎక్కువ పుస్తకాలను అందించింది. ఈ పుస్తకాలు పిల్లలకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను" అని ఆకర్షణ తండ్రి సతీష్ కుమార్ చెప్పారు. హైదరాబాద్‌లోని ఒక మెట్రో స్టేషన్‌లో ఆమె నాల్గో లైబ్రరీని ఏర్పాటు చేయబోతున్నారని తాను ఖచ్చితంగా అనుకుంటున్నట్లు చెప్పారు. ఈరోజు సిద్దిపేటలోని భరోసా కేంద్రంలో ఐదో లైబ్రరీ ఏర్పాటుకు ఏడీజీపీ శిఖా గోయెల్ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications