హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హామ్మయ్యా.. ఆ 13 మందికి Omicron నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న తెలంగాణ

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ అంటే భయాందోళన.. నిన్న మరీ 16 కేసులు వెలుగుచూశాయి. ఇవాళ 2 వచ్చాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అలజడి లేదు. విదేశాల నుంచి వచ్చినవారిని టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. 13 మందిని ఐసోలేసన్‌లో ఉంచారు. ఒమిక్రాన్ అవునో కాదో తెలియజేసేందుకు జినోమ్ సిక్వెన్సింగ్‌కు పంపించారు. ఆ రిపోర్ట్ వచ్చింది. వారిలో అందరికీ ఒమిక్రాన్ నెగిటివ్ వచ్చింది. దీంతో యావత్ తెలంగాణ ఊపిరి పీల్చుకుంది.

నో ఒమిక్రాన్

నో ఒమిక్రాన్

హై రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారికి టెస్ట్ చేశారు. వారికి ఒమిక్రాన్ లేకపోవడంతో.. ప్రస్తుతం తెలంగాణలో కేసులు లేవు. కానీ దేశంలో మాత్రం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 16 కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో రెండు కేసులు వచ్చాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. తొలుత బెంగళూరులో వెలుగుచూసింది. ఇద్దరికీ ఒమిక్రాన్ అని తేలింది. తర్వాత ఢిల్లీలో ఒకరు, గుజరాత్ జామ్ నగర్‌లో ఒకరు, మహారాష్ట్రలో ఒకరికి చొప్పున కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కేసులు ఐదుకు చేరింది.

మహారాష్ట్ర, రాజస్తాన్

మహారాష్ట్ర, రాజస్తాన్

నిన్న ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళన కలిగించింది. మహారాష్ట్రలో 7, రాజస్తాన్‌లో 9 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది. ఇలా ఉండగా ఇవాళ మరో రెండు కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో మరో ఇద్దరికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా సోకింది. దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి తిరిగి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తి, అమెరికా నుంచి తిరిగి వచ్చిన 36 ఏళ్ల అతడి స్నేహితుడికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా సోమవారం నిర్ధారణ జరిగింది. ఎలాంటి లక్షణాలు లేని వారిద్దరూ సెవెన్‌ హిల్స్ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పదికి చేరినట్లు పేర్కొంది. ఫస్ట్ ఒకటి.. నిన్న ఏడు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి రెండు కేసులతో ఆ సంఖ్య పదికి చేరింది.

Recommended Video

#Spirit : ఆ సినిమా బడ్జెట్‌లో సగం ప్రభాసే తీసుకుంటున్నాడట! || Oneindia Telugu
థర్డ్ వేవ్

థర్డ్ వేవ్

దేశంలో ఒమిక్రాన్‌ మొత్తం కేసుల సంఖ్య 23కు చేరింది. ఆదివారం ఒక్కరోజే 17 కేసులు వచ్చాయి. 9 కేసులు రాజస్థాన్‌లో రాగా.. 7 కేసులు మహారాష్ట్రలోని పుణే జిల్లాలో వచ్చాయి. అంతకుముందు కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, ఢిల్లీలో ఒక కేసు బయటపడ్డాయి. సోమవారం ముంబైలో మరో ఇద్దరికి నిర్ధారణ కావడంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 23కి పెరిగింది. ఈ వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పుపై ఆందోళన వ్యక్తం అవుతుంది.

English summary
13 people who land in hyderabad in recenlty. they are omicron negative officials said in the statement
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X