తెలంగాణలోనూ తగ్గుముఖం: వైరస్ సోకిన ఇద్దరు మృతి

తెలంగాణలో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 81,417 శాంపిల్స్ పరీక్షించారు. 2,421 మందికి పాజిటివ్ వచ్చింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 649 కొత్త కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 144, రంగారెడ్డి జిల్లాలో 114, హనుమకొండ జిల్లాలో 106, నల్గొండ జిల్లాలో 100 కేసులు వెల్లడయ్యాయి.

3,980 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,71,828 మంది కరోనా బారినపడగా, వారిలో 7,34,628 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. ఇంకా 33,104 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,096కి పెరిగింది.

 2421 coronacases found at telangana

దేశంలో ఒమిక్రాన్ సాముహిక వ్యాప్తి దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఇంతలోనే డ్రాగన్ మరో స్టేట్ మెంట్ ఇచ్చింది. కొత్త వైరస్ వేరియంట్ గురించి చెప్పి.. ఆందోళన కలుగజేసింది. యూరప్‌లో కూడా ఈ ఏడాది చివరి వరకు కరోనా వైరస్ అంతం అవుతుందని ప్రకటన చేసింది.

ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసారి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస్ బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. రికవరీ రేటు కూడా ఎక్కువే ఉండటం ఊరట కలిగించే అంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+