శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నకిలీ వీసాల కలకలం .. 26 మంది మహిళలు అరెస్ట్
తెలంగాణా రాష్ట్రంలో నకిలీ వీసాలకు కొదువే లేదని తేల్చేసింది నేడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన సంఘటన . శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయంలో నకిలీ వీసాలు కలకలం సృష్టించింది . సాధారణంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు చేస్తున్న తనిఖీల్లో భాగంగా ఈ విషయం బైటపడినట్లుగా తెలుస్తోంది.

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 26 మంది మహిళలు నకిలీ వీసాలతో అడ్డంగా బుక్కయ్యారు. ప్రయాణీకుల వద్ద అధికారులు వీసాలను పరిశీలిస్తుండగా..26 మంది మహిళలు నకిలీ వీసాలతో కువైట్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తేలింది. దీంతో వీరందరినీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు..ఈ నకిలీ వీసాల వెనుకున్న వారు ఎవరు..ఎక్కడ ఈ వీసాలను తయారుచేశారు. దీనికి అసలు సూత్రధారులు ఎవరు అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తే నకిలీ వీసాల ముఠా గుట్టు రట్టయ్యే అవకాశం వుంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications