గుడ్ న్యూస్: ఇంటర్ విద్యార్థులకు, 70 శాతం సిలబస్
కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఫిజికల్ క్లాసులు క్రమంగా జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కేవలం 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తామని ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు స్టడీ మెటీరియల్‌ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
ఇంటర్ పరీక్షల్లో ఒత్తిడి, భయం లేకుండా ఉండేందుకే ఈ స్టడీ మెటీరియల్ ఇస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఈ సారి పరీక్షల్లో 70 శాతం సిలబస్ నుండే ప్రశ్న లు ఇస్తాయని అలాగే 50 శాతం ఛాయిస్ ఉంటుందని ప్రకటన చేశారు. లక్షలాది మంది విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ ఉపయోగపడుతుందని... నిష్ణాతులతో స్టడీ మెటీరియల్ తయారీ చేయించినట్లు చెప్పారు. ఇంటర్ వెబ్ సైట్‌లో స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుందన్నారు.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications