తెలంగాణలో భారీగా తగ్గుముఖం: 767 కేసులు.. ముగ్గురు మృతి
కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో లక్షా 18 వేల 778 మందికి పరీక్షలు చేయగా 767 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో కరోనా సోకి ముగ్గురు చనిపోయారు. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 3 వేల 738కి చేరింది. ఒక్కరోజులో 848 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల 064 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ్రేటర్‌లో 77 కేసులు వచ్చాయి.
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.












Click it and Unblock the Notifications