హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రానికి మోడీ రాక: 8 వేల మంది పోలీసులతో భద్రతా.. ముచ్చింతల్ అష్టదిగ్బందనం..

|
Google Oneindia TeluguNews

జై శ్రీమన్నారాయణ శబ్దాలతో ముచ్చింతల్ మారుమోగుతోంది. యాగశాల, సమతామూర్తి ప్రాంగణానికి వేలాది మంది భక్తులు తరలివస్తుండడంతో ఆధ్మాత్మిక శోభ విల్లివిరుస్తోంది. త్రిదండి చిన జీయర్ స్వామి నేతృత్వంలో వేలాది మంది పండితులు క్రతువును నిర్వహిస్తున్నారు. మహోత్సవానికి ప్రధాని మోడీ విచ్చేస్తున్నారు. దీంతో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.

8 వేల మంది పోలీసులు

8 వేల మంది పోలీసులు


మోడీ పర్యన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సీఎస్ సోమేష్ కుమార్ పర్యవేక్షించారు. సమతాపూర్తి సన్నిధిలో మోడీ మూడు గంటలపాటు ఉంటారని.. రాత్రి 8.00 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్తారని తెలిపారు. ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో 8 వేలమంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రధాని భద్రత కారణంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

పోస్టల్ స్టాంప్..

పోస్టల్ స్టాంప్..

శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. హెలికాప్టర్‌లో 2:45 గంటలకు ఇక్రిశాట్‌కు చేరుకుని స్వర్ణోత్సవాలను ప్రారంభిస్తారు. మొక్కల రక్షణ కోసం వాతావరణ మార్పు పరిశోధన కేంద్రాన్ని, రాపిడ్‌ జనరేషన్‌ అడ్వాన్స్‌మెంట్‌ సౌకర్యాన్ని ప్రారంభిస్తారు. అనంతరం స్వర్ణోత్సవాల లోగోను ఆవిష్కరించి, ప్రత్యేక పోస్టల్‌ స్టాంపును విడుదల చేస్తారు. ఆ తర్వాత అక్కడి శాస్త్రవేత్తలతో భేటీ అవుతారు. ఆపై హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌కు చేరుకొని రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు.

ఆ సమయంలో అనుమతి లేదు

ఆ సమయంలో అనుమతి లేదు


ఇక్రిశాట్ నుంచి ప్రధాని హెలికాప్టర్‌లో 5.15కి ప్రధాని యాగశాలకు చేరుకుంటారు. 5.30 నుంచి 6 గంటల వరకు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత రామానుజుల విగ్రహాన్ని ప్రపంచానికి అంకితం చేస్తారు. అక్కడ ప్రత్యేక పూజ నిర్వహించి సందేశం ఇస్తారు. ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ వెళ్తారు. తిరుగు ప్రయాణంలో ప్రధాని 13 కి.మీ. రోడ్డుమార్గంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు.

15 నెలల తర్వాత రాక

15 నెలల తర్వాత రాక

15 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని వస్తున్నారు. 2020 నవంబరు 28న జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌కు వచ్చి జినోమ్‌వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాల తయారీ కేంద్రాన్ని సందర్శించి వెళ్లారు. ముచ్చింతల్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ కలిసి వేదికను పంచుకోనున్నారు.

English summary
8 thousand police protection to prime minister narendra modi tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X