Crime News: 35 డైమండ్లు ఉన్న బ్యాగ్ పోయింది.. కానీ దాన్ని ఎవరూ తీయలేదు..
ఓ వ్యాపారి భార్యతో పాటు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్లో తిగాడు.. కానీ అక్కడికి టీమిండియా ఆటగాళ్లు వచ్చారు. దీంతో హోటల్ సిబ్బంది మిగతా వారికి సరిగా సర్వీస్ చేయలేదు. దీంతో వారు హోటల్ నుంచి మరో హోటల్ కు వెళ్లారు. వారు మరో హోటల్ కు వెళ్లి చూసేసరికి వారి వద్ద ఉన్న అభరణాలు ఉన్న ఉన్న బ్యాగ్ పోయినట్లు గుర్తించారు.
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా బ్యాగ్ దొరగ లేదు. కానీ కొద్ది రోజుల తర్వాత బ్యాగ్ దొరికింది. అయితే ఈ ఘటనలో హోటల్ తీరు అనుమానాస్పదంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన అహ్మద్ బేగ్ అనే ఓ వ్యాపారి గత నెల 22న భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చారు. వారు బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని పార్క్‌హయత్ హోటల్‌లో దిగారు.

గత నెల 24వ తేదీన ఇదే హోటల్‌లో ఇండియన్ క్రికెట్ ఆటగాళ్లు బస చేశారు. దీంతో అక్కడున్న మిగతా వారికి సరైన సేవలు అందకపోవడంతో బేగ్ దంపతులు అక్కడ నుంచి వచ్చి సోమాజిగూడలోని పార్క్ హోటల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారి వద్ద ఉన్న బంగారు అభరణాలు బ్యాగ్ కనిపించకుండా పోయింది. వెంటనే బేగ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్యాగులో డైమండ్ బ్రాస్‌లైట్, 35 డైమండ్లు, డైమండ్ రింగ్, మంగళసూత్రం ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. అయినా బ్యాగ్ అచూకీ లభించలేదు. మరోవైపు పంజాగుట్టు పోలీసులు కూడా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇది ఇలా ఉండగా మంగళవారం బంజారాహిల్స్ క్రైం పోలీసలు మరోసారి పార్క్‌హయత్ హోటల్‌లో తనిఖీలు చేపట్టగా.. బ్యాగ్ దొరికింది. ఈ వ్యవహరంలో హోటల్ తీరు అనుమానాస్పదంగా ఉంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications