విషాదం: హాస్టల్ భవనంపైనుంచి పడి ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ భవనంపై నుంచి పడి ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. బీఎన్ రెడ్డినగర్‌లోని జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తికి చెందిన 21 ఏళ్ల రమ్య ఇబ్రహీంపట్నంలోని శ్రీదత్త ఇంజినీరింగ్ కాలేజీలో తృతీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి శోభన్ రెడీమిక్స్ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అక్కడి నుంచి కాలేజీ దూరంగా ఉండటంతో కొంతకాలంగా బీఎన్ రెడ్డినగర్ లోని లక్ష్మీదుర్గా ఉమెన్స్ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటోంది.

కాగా, శనివారం రాత్రి హాస్టల్ రెండో అంతస్తుపైన ఉన్న రెయిలింగ్ పై కూర్చుని స్నేహితులతో మాట్లాడుతోంది. అయితే, ఒక్కసారిగా అదుపుతప్పి వెనక్కి పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి చికిత్స పొందుతూ రమ్య మరణించింది.
కూతురు మరణవార్త విని ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications