Fire Accident: సికింద్రాబాద్‍లో భారీ అగ్ని ప్రమాదం..
సికింద్రాబాద్ రాంగోపాల్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నల్లగుట్టలోని డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ మాల్‌లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి షాపింగ్‌మాల్ మొత్తానికి విస్తరించడంతో మంటలు ఎగసిపడుతున్నాయి.దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. పక్కనున్న మరో భవనానికి కూడా మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాద సమయంలో భవనంపై ముగ్గురు ఉన్నారు. వారిని రెస్క్యూ టీం రక్షించింది. భారీ క్రేన్ సహాయంతో వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. కాగా, బిల్డింగ్‌లోనుంచి దట్టంగా పొగ వెలువడుతుండటంతో సహాయక చర్యలకు విఘాతం ఏర్పాడుతుంది. పక్క భవనాల్లో ఉన్న వారు బయటకు వస్తున్నారు.

సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ కానిస్టేబుల్ అస్వస్థతకు గురి అవ్వడంతో అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. మరికొన్ని గంటల వరకు సహాయక చర్యలు కొనసాగేలా పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 10 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదానికి షాట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ భవనంలో మొత్తం 5 అంతస్తులు ఉన్నాయి. కింద భవనంలో కార్ల షోరూం ఉండగా, పైన బట్టల షాపు ఉంది. బట్టలు ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి.












Click it and Unblock the Notifications