ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు.. పక్క పక్క వీధుల్లోనే కాపురం
ఓ వ్యక్తి, ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుని మోసం చేశాడు. పెళ్లి చేసుకోవడమే కాదు వారిని పక్క పక్క కాలనీల్లో ఉంచి కాపురం చేశాడు. వారిని అందనకాడికి దండుకుని ముఖం చాటేశాడు ఆ నిత్యపెళ్లి కొడుకు. అయితే ఈ ఘటన ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే జరిగింది. ఏపీలోని గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన అడపా శివశంకర్‌బాబు వివాహ పరిచయ వేదిక ద్వారా పలువురు యువతలను పరిచయం చేసుకున్నాడు.

విడాకులు తీసుకున్న వారే టార్గెట్..
మొదటి పెళ్లి అయితే అబ్బాయి గురించి ఎంక్వారీ చేస్తారని వివాహమై విడాకులు తీసుకున్న యువతులే లక్ష్యంగా చేసుకున్నాడు. పెద్ద కం పెనీలో ఉద్యోగమని.. భారీగా జీతం వస్తుందని వారితో చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరిని.. 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.పెళ్లైన తర్వాత అవసరాల కోసమని వారి వద్ద రూ.లక్షల్లో డబ్బు కొట్టేశాడు. డబ్బులు అడిగితే క్లయింట్ వద్దకు వెళ్తున్నానని చెప్పి పరారయ్యేవాడు. మోసపోయామని తెలుసుకున్న ఇద్దరు బాధితులు హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో అతని బాగోతం బయట పెట్టారు.

ఏడుగురు కొండాపూర్ లో..
తమని వివాహం పేరుతో మోసం చేశాడని, దాదాపు రూ.60లక్షల వరకు నగదు, బంగారు ఆభరణాలు నిందితుడికి ఇచ్చామని బాధితులు వాపోతున్నారు. అతను క్లయింట్ వద్దకు వెళుతున్నానని చెప్పి మరో భార్య దగ్గరికి వెళ్లే వాడని చెప్పారు. అతడి చేతిలో మోసపోయిన 11 మందిలో ఏడుగురు కొండాపూర్ ప్రాంతంలోనే ఉన్నారని పేర్కొన్నారు.ఏపీకి చెందిన ఓ మంత్రి బంధువునని శివశంకర్ చెప్పినట్టు బాధితులు తెలిపారు.

అందుకే ప్రెస్ మీట్..
తమ లాగా మరొకరు మోసపోవద్దనే మీడియా ముందుకు వచ్చినట్టు చెప్పారు. శివశంకర్‌ను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.అతని చేతిలో మోసపోయిన యువతులు అందరూ ఉన్నత విద్య అభ్యసించిన వారే కావడం ఆశ్చర్య పరిచే విషయం.












Click it and Unblock the Notifications