స్కూల్ చిన్నారులపై ప్రిన్సిపల్ కొడుకు అమానుషం; చాక్లెట్స్ ఆశచూపించి న్యూడ్ వీడియోలు తీసి, ఆపై..
హైదరాబాద్: మనుషుల్లో మానవత్వం రోజురోజుకీ కనుమరుగైపోతుంది. దానవత్వం పెరిగిపోతోంది. ఏం చేస్తున్నాము అన్న విచక్షణ మరచి దారుణంగా ప్రవర్తిస్తున్న వారు, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా అకృత్యాలకు పాల్పడుతున్న వారు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చదువుకున్నవారు, చదువులేని వారు అన్న తేడా లేకుండా సభ్యతను మరచి ప్రవర్తిస్తున్నారు. ఇక అటువంటి ఘటనే హైదరాబాద్లో చోటుచేసుకుంది.

స్కూల్ చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రిన్సిపల్ కొడుకు
ఈ ఘటన వివరాల్లోకి వెళితే హైదరాబాద్ సంతోష్ నగర్ లో మొయిన్ బాగ్ లోని ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపాల్ కొడుకు స్కూల్ పిల్లల పై అమానుషంగా ప్రవర్తించిన ఘటన స్థానికులను, విద్యార్థుల తల్లిదండ్రులను షాక్ కు గురి చేసింది. స్కూల్ నిర్వహణతో పాటుగా, ప్రిన్సిపల్ కుటుంబం కూడా అదే భవనంలో నివాసముంటోంది. ఈ క్రమంలో ప్రిన్సిపల్ కొడుకు పిల్లలకు చాక్లెట్ ఆశ చూపించి, వారి న్యూడ్ వీడియో లను తీసి లైంగిక వేధింపులకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ప్రిన్సిపల్ కొడుకు కావడంతో బాలికలు అతనిపై ఫిర్యాదు చేయడానికి భయపడేవారు.

తల్లిదండ్రులకు చెప్పిన బాలిక .. ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు
ప్రిన్సిపల్ కుమారుడు యాసర్ స్కూల్ పిల్లల్ని బెదిరిస్తూ లైంగిక దాడికి పాల్పడేవాడు. గత కొంతకాలంగా చాలా మంది చిన్నారుల పట్ల అతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక ప్రిన్సిపల్ కుమారుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఒక బాలిక ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పింది. చిన్నారి చెప్పిన విషయాన్ని విని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు స్కూల్ ప్రిన్సిపాల్ కుమారుడు యాసర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై సెక్షన్ 354a, 509, 9(m) r/w, పోక్సో చట్టం 2012 కింద కేసు నమోదు చేశారు.

స్కూల్ బాలికలపై లైంగిక దాడులు చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు
ఇక అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న న్యూడ్ వీడియోలు చూసి షాక్ అయ్యారు. ఫిర్యాదు ఇచ్చిన బాలికనే కాకుండా, అతను కొంతకాలంగా చాలామంది స్కూల్ చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు అందులో వున్న వీడియోల ద్వారా పోలీసులు గుర్తించారు. ఇక ఈ వ్యవహారంలో మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దేశంలో బాలికలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులు
లైంగిక వేధింపుల నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నా, దేశ వ్యాప్తంగా అనేక ఘటనలు ఇలాంటివే చోటుచేసుకుంటున్నాయి. నిర్భయ, దిశ వంటి చట్టాలు తీసుకువచ్చినా, కామాంధులు భయపడుతున్న పరిస్థితులు కనిపించడం లేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట బాలికల పైన ఇటువంటి లైంగిక వేధింపుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ ఘటనలు పునరావృతం కాకుండా బాలికలు తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అంతేకాదు తమ పట్ల ఎవరైనా అమానుషంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి వారిపై చర్యలు తీసుకునే లాగా చూడాల్సిన అవసరం ఉంది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications