Hyderabad: కొండాపూర్ లో దారుణం.. నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి..
ఇంటి యజమాని నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. హైదరాబాద్ కొండాపూర్ లో ఈ ఘటన జరిగింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరు దురదృష్టవశాత్తు నీటి సంపులో పడిపోయాడు. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన అక్మల్ అనే వ్యక్తి ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అతను కొండాపూర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.
అక్మల్ రోజు ఉదయం జిమ్ చేస్తాడు. రోజు మాదిరిగానే అక్మల్ జిమ్ చేసి ఇంటికి వస్తున్నాడు. అయితే నీటి సంప్ నడిచే మార్గంలోనే ఉంది. అక్మల్ గేట్ తీసుకుని లోపలికి వచ్చాడు. అతని ఒక చేతిలో కవర్ ఉంది. మరో చేతిలో ఫోన్ ఉంది. అతను కింద గమనించకుండా ముందుకు వెళ్లాడు. దీంతో నీటి సంపులో పడిపోయాడు. అతను నీటి సంపులో పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. భవన యజమాని ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యక్మల్ మృతదేహాన్ని సంపు నుంచి బయటకు తీసారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో యజమాని నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. సీసీ కెమెరా దృశ్యాలు చూస్తుంటే.. యక్మల్ సంపులో పడిన వెంటనే యజమాని స్పందించలేదని అర్థమవుతోంది. యజమాని నిర్లక్ష్యం స్ఫష్టంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications