హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌ను వణికిస్తున్న వైరస్‌లు: ఓ వైపు కరోనా..మరోవైపు స్వైన్ ఫ్లూ, 2పాజిటివ్ కేసులు, ‘నమస్కారమే’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ వైపు కరోనావైరస్ కేసు నమోదవడంతో ఆందోళన చెందుతున్న నగర, రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు మరో వైరస్ స్వైన్ ఫ్లూ కూడా వణికిస్తోంది. ఓ పోలీసు కానిస్టేబుల్‌కు స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు మంగళవారం నిర్ధారించారు.

ఓ పోలీసుకు స్వైన్ ఫ్లూ పాజిటివ్..

ఓ పోలీసుకు స్వైన్ ఫ్లూ పాజిటివ్..

పేట్లబురుజులో 9 మంది ఏఆర్ కానిస్టేబుళ్ల అస్వస్థతకు గురికావడంతో వారిని ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. వారిలో ఒకిరికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 8 మందిని డిశ్చార్జ్ చేసి, స్వైన్ ఫ్లూ సోకిన వ్యక్తిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పూర్తిగా తగ్గిన అనంతరం డిశ్చార్జ్ చేస్తామని ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ తెలిపారు. స్వైన్ ఫ్లూ త్వరగా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉండటంతో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానితులు

గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానితులు


గాంధీ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం మరో ముగ్గురు కరోనావైరస్ అనుమానితులు చేరారు. ప్రత్యేక అంబులెన్స్‌లో వారిని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు వైద్య సిబ్బంది. ఈ ముగ్గురికీ రక్త పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. రక్త నమూనాల ఫలితాలు వచ్చే వరకూ వీరికి కరోనావైరస్ సోకిందా? లేదా? అనే విషయాన్ని చెప్పలేదమని వైద్యులు తెలిపారు. కాగా, ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ కరోనావైరస్ బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా కరోనావైరస్ అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి.

కరచాలనం వద్దు.. నమస్కారమే ముద్దు..

కరచాలనం వద్దు.. నమస్కారమే ముద్దు..

ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. కరోనావైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు, మార్గదర్శకాలను విడుదల చేస్తున్నాయి. కరోనా అనుమానితులతో కరచాలనం చేయొద్దని, కొన్ని రోజులపాటు నమస్కారం చేసుకుంటే మంచిదని మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. తెలంగాణ సర్కారు కూడా ప్రత్యేక హెల్ప్ లైన్, కాల్ సెంటర్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కరోనా వైద్యం కోసం ప్రత్యేక ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

English summary
A swine flu positive case reported in hyderabad on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X