హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వసం - ఆగ్నిపథ్ ఆందోళనలు: రైళ్లకు నిప్పు -అదుపు తప్పిన పరిస్థితి..!!

|
Google Oneindia TeluguNews

అగ్నిపథ్ ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి అదుపు తప్పింది. నిరసన కారులతో కర్రలతో స్టేషన్ లోకి ప్రవేశించారు. పార్శిల్ బాక్సులు రైలు పట్టాలపై వేసారు. వాటికి నిప్పు పెట్టారు. అగ్నిపథ్ నిర్ణయం ఉప సంహరించుకోవాలని నినాదాలు చేసారు. దేశ వ్యాప్తంగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడు సికింద్రాబాద్ కు విస్తరించాయి. పెద్ద ఎత్తున ఆందోళన కారులు స్టేషన్ లోకి చేరటంతో.. పరిస్థితి ఉద్రిక్తం గా మారింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

కేంద్రం సైతం దీని పైన ఇప్పటికే వివరణ ఇచ్చింది. అటు బీహార్ లోనూ రైలుకు నిప్పు పెట్టి ఆందోళనలు కొనసాగుతున్నాయి. రెండు గంటలుగా విధ్వంసం కొనసాగుతోంది. స్టేషన్ లోని లైట్లు...ఫర్నీచర్ ను ధ్వంసం చేస్తున్నారు.

Agnipath scheme: Protestests havoc in Secunderabad Railway station, protests continues

వందల మంది ఒకే సారి స్టేషన్ లోకి చేరుకోవటం.. వస్తూనే విధ్వంసానికి పాల్పడటంతో ఆర్పీఎఫ్ సిబ్బందికి సైతం వారిని నియంత్రించటం కష్టంగా మారింది. ముఖాలకు ముసుగులు వేసుకొని.. స్టేషన్ లోని సీసీ కెమేరాలను సైతం ధ్వంసం చేసారు. ప్లాట్ ఫాంల పైన ఉన్న స్టాల్స్ ను ధ్వంసం చేసారు. నిలిచి ఉన్న రైలు బోగీల్లోనూ నిప్పు పెట్టారు.

ప్లాట్ ఫాంలపైన ఉన్న స్టాల్స్ పూర్తిగా ధ్వంసం చేసారు. రెండు గంటల పాటు విధ్వంస కాండ కొనసాగింది. రెండు రైలు బోగీలు పూర్తిగా దహనమయ్యాయి. రైళ్ల పైన రాళ్లు విసరటంతో ప్రయాణీకులు బయటకు పరుగులు తీసారు. పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. సికింద్రాబాద్ చేరుకోవాల్సిన రైళ్లు ఎక్కడికక్కడే నిలిపివేసారు. ఊహించని విధంగా జరిగిన దాడితో అందరూ షాక్ అయ్యారు. ఆగ్నపథ్ రద్దు చేసి ఆర్మీ పరీక్షలు కొనసాగించాలని నినాదాలు చేసారు. పెద్ద రాళ్లతో రైళ్ల కిటికీలను ధ్వసం చేసారు. ప్రయాణీకులు లోపలే ఉన్నా..దాడులు చేసారు.

దీంతో.. ప్రయాణీకులు భయంతో పరుగులు తీసారు. స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సుల అద్దాలను సైతం పగుల కొట్టారు. పోలసులకు సమాచారం ఇచ్చినా..వారొచ్చే లోపే జరగాల్సిన విధ్వసం జరిగిపోయింది. వారిని నియంత్రించేందుకు స్టేషన్ లో విధుల్లో ఉన్న రక్షణ సిబ్బంది అడ్డుకొనే ప్రయత్నం చేసినా..సాధ్యపడలేదు. తాము ఎంతో కాలంగా ఆర్మీ పరీక్షల కోసం ప్రయత్నాలు చేసి..వేచి చూస్తుంటే..తాజాగా తీసుకున్న నిర్ణయంతో తాము నష్టపోతున్నామని అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి.

English summary
Agnipath scheme protests have reached Secunderabad railway station where NSUI students and activists have pelted stones on bus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X