దళిత బీజేపీ కార్యకర్తలో ఇంట్లో అమిత్ షా: భావోద్వేగానికి గురైన సత్యనారాయణ ఫ్యామిలీ
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా సికింద్రాబాద్‌లోని సాంబమూర్తి నగర్ కాలనీ పరిధిలోని కళాసిగూడలో ఉన్న బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. అమిత్ షాకు స్థానిక కార్పొరేటర్ స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర హోం మంత్రిని బీజేపీ కార్యకర్త సత్యనారాయణ తన ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు.

బీజేపీ కార్యకర్త ఇంట్లో కాఫీ తాగిన అమిత్ షా
అనంతరం సత్యనారాయణ అందించిన వేడివేడి కాఫీని అమిత్
షా తాగారు. కాఫీ తాగుతూ.. సత్యనారాయణ, ఆయన కుటుంబసభ్యుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణ ఇంటికి అమిత్ షా చేరుకోగానే స్థానిక బీజేపీ కార్యకర్తలు ఆయనను కలిసేందుకు పోటీపడ్డారు. దీంతో వారిని పోలీసులు అదుపు చేశారు. సత్యనారాయణ ఇంట్లోకి కేవలం అనుమతి ఉన్న అతికొద్ది మందిని మాత్రమే అనుమతించారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు.
అమిత్ షా రాకతో సంతోషంలో సత్యనారాయణ కుటుంబం
కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ ఇంటికి రావడం పట్ల బీజేపీ కార్యకర్త సత్యనారాయణ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తంచేశారు. ఈరోజు తమ ఇంటిల్లిపాదికి పండగరోజని సత్యనారాయణ తెలిపారు. తన లాంటి అతి సామాన్య కర్యకర్తను కూడా గుర్తించినందుకు గర్వంగా ఉందని సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. అమిత్ షా లాంటి పెద్ద వ్యక్తి తమ ఇంటికి వచ్చి, తమ ఆతిథ్యాన్ని స్వీకరించటం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని సత్యనారాయణ కుటుంబసభ్యులు ఉబ్బితబ్బియ్యారు. చిన్నతనంలోనే తన తల్లి అనారోగ్యం కారణంగా చదువు ఆపేసి ఎన్నో కష్టాలు పడ్డట్టు గుర్తుచేసుకుని సత్యనారాయణ భావోద్వేగానికి లోనయ్యారు. 30 ఏళ్లుగా పార్టీలో ఉన్నాననీ, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చే వరకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.
పండగ వాతావరణం అంటూ సత్యనారాయణ ఫామిలీ ఆనందం
'ఈ రోజు మా జన్మ ధన్యమైంది. మొత్తం దేశానికి హోం మంత్రిగా ఉన్న వ్యక్తి .. చిన్నపాటి బస్తీలో ఉన్న మా ఇంటికి రావడం నిజంగా గొప్ప అదృష్టం. మేం దీన్ని జీవితాంతం మర్చిపోలేం. నిన్నటి నుంచి మా కాలనీలో పండుగ వాతావరణం ఉంది. అమిత్ షా కోసం వేయికళ్లతో ఎదురుచూశాం. ఆయన మా ఇంటికి రాగానే ఆనందాన్ని ఆపుకోలేకపోయాం' అని సత్యనారాయణ కుటుంబసభ్యులు చెప్పుకొచ్చారు. బీజేపీలో సామాన్య కార్యకర్తకు కూడా గుర్తింపు ఉంటుందని ఈ ఘటన నిరూపించిందని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. బీజేపీలో దళితులకు తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. కేంద్రమంత్రి రావడంతో ఆ ప్రాంతం మొత్తం సందడిగా మారింది.
మహంకాళీ ఆలయంలో అమిత్ షా పూజలు
కాగా, మునుగోడులో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రాయానికి చేరుకున్న అమిత్ షాకు తెలంగాణ ఇంఛార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌తో పాటు 15 మంది కార్పొరేటర్లు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రబాద్‌లోని ఉజ్జయిని మహంకాళీ ఆలయానికి ఆయన చేరుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో అమిత్ షాకు స్వాగతం పలికారు. అమ్మవారికి అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో అమిత్ షా మునుగోడుకు బయల్దేరారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications