నగర పాలక సంస్ధ వినూత్న ప్రయోగం.!గణేష్ నిమజ్జనాలకు నగరంలో 74 తాత్కాలిక చెరువులు.!

హైదరాబాద్: వినాయకుడి నిమజ్జన మహోత్సవాలకు నగర పాలక సంస్థ వినూత్న ఏర్పాట్లను చేస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా నూతన పద్దతులలో నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించించేందుకు సన్నాహాలు చేస్తోంది నగర పాలక సంస్థ. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో నిమజ్జనానికి 74 తాత్కాలిక చెరువులను సిద్దం చేస్తున్నారు నగర పాలక అధికారులు. కొన్ని చోట్ల కుంటలతో పాటుగా తాత్కాలికంగా ప్రత్యేక కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశారు. శాశ్వతంగా జిహెచ్ఎంసి ద్వారా 28 ప్రాంతాల్లో నిమజ్జన కొలనులను నిర్మించారు.

 74 తాత్కాలిక చెరువులు..

74 తాత్కాలిక చెరువులు..

ఈ సంవత్సరంలో నూతనంగా ప్రిఫ్యాబ్రికేటెడ్ ఫైబర్ రెయిన్ ఫోర్స్ డ్ ప్లాస్టిక్ (ఎస్.ఆర్.పి) 1.35 నుండి 150 మీటర్ల లోతుతో 30x10 పొడవు గల పోర్టబుల్ బే కృత్రిమ కొలనులను 24 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశారు.. మరో 22 ప్రదేశాలలో గుర్తించి ఎక్స్ వేటర్ (డ్రగ్ పాండ్, త్రవ్వకం చేసి తాత్కాలికంగా కొలను ఏర్పాటు చేశారు.

24 కృత్రిమ కొలనులు (పోర్టబుల వాటర్ ట్యాంక్) ల వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్బీనగర్ జోన్ లో 4 ఏర్పాటు చేసారు. అవి 1. ఏ.ఎస్ రావు నగర్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ 2.సచివాలయ నగర్ ఆఫీసర్స్ కాలని వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్. 3.ఏం అర్ ఓ ఆఫీస్ హయత్ నగర్, 4. మున్సిపల్ ఆఫీస్ వెనుక గల ప్రభుత్వ కళాశాల

వినూత్న రీతిలో నిమజ్జనాలు..

వినూత్న రీతిలో నిమజ్జనాలు..

అంతే కాకుండా చార్మినార్ జోన్ లో 3 కొలనులను ఏర్పాటు చేసారు. 1. కృష్ణ తులసి నగర్ పార్కు 2. రియసత్ నగర్ శివాలయ గ్రౌండ్ 3. శ్రీ లక్ష్మీ ఈశ్వర ప్లే గ్రౌండ్ జనగంమెట్ లో ఏర్పాటు చేశారు. ఖైరతబాద్ బాద్ జోన్ లో 5 తాత్కాలిక చెరువులు ఏర్పాటు చేసారు. 1.100 ఫీట్ రోడ్డు యస్ బి ఎ గార్డెన్ 2. నిజాం కాలేజీ ప్లే గ్రౌండ్ 3. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, 4. అమీర్ పేట్ ప్లే గ్రౌండ్, 5. ఎన్.బి.టి నగర్ లో ఈ కొలనులను నిమజ్జనానికి సంసిద్దం చేసారు నగర పాలక అధికారులు.

ఎక్కడి లంబోదరులు అక్కడే..

ఎక్కడి లంబోదరులు అక్కడే..

ఇక శేరిలింగంపల్లి జోన్ లో 3 చెరువులను అందుబాటులో ఉంచారు నగర పాలక సంస్ధ అధికారులు. 1. ఐ మ్యాక్స్ థియేటర్ వెనుక 2.పి.జె.ఆర్ స్టేడియం చందానగర్ , 3. పటాన్ చెరువు సాకి చెరువులో ఏర్పాటు చేసారు. కూకట్ పల్లి జోన్ లో 3 చెరువులను ఏర్పాటు చేసారు. 1.చిత్తరమ్మ టెంపుల్ వివేక నంద నగర్, 2. హెచ్.ఎం.టి ఓపెన్ ప్లేస్, 3. కౌకూర్ పార్క్, వాటర్ ట్యాంక్ దగ్గర ఏర్పాటు చేసారు. సికింద్రాబాద్ జోన్ లో 4 తాత్కాలిక కొలనులను ఏర్పాటు చేసారు. 1.ఆజాద్ నగర్ అంబర్ పేట్ స్టేడియంలో రెండు కొలనులు, 2. ఎన్.టి.ఆర్ స్టేడియంలో రెండు కొలనులు, 3. చిలకలగూడ మున్సిపల్ గ్రౌండ్, మారేడ్ పల్లి ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసారు.

 హుస్సేన్ సాగర్ కు కాలుష్య ముప్పు..

హుస్సేన్ సాగర్ కు కాలుష్య ముప్పు..

వీటితో పాటు ఎల్బీనగర్ జోన్ లో సర్కిల్ 2లో దేవేందర్ నగర్ రోడ్డు, సర్కిల్ 4 వనష్టలి పురం స్విమ్మింగ్ పూల్ ప్రక్కన క్రికెట్ గ్రౌండ్, హుడా భారతీ నగర్, 5సర్కిల్ లో సరూర్ నగర్ ఎన్.టి.ఆర్ నగర్ కూరగాయల మార్కెట్, చార్మినార్ జోన్ లో 5 ప్రదేశాలలో 6వ సర్కిల్ లో ఏకలవ్య గ్రౌండ్, 7వ సర్కిల్ లో గౌలి పూర బతుకమ్మ బావి , వైశాలి నగర్ కామన్ చాంపా పెట్ మెయిన్ రోడ్డు, 11వ సర్కిల్ లో మైలార్ దేవలపల్లి నర్సబాయి కుంట. సాయి భవాని ఎంకేవే , ఖైరతాబాద్ జోన్ లో సర్కిల్ 12లో పి వి అర్ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ 54 , చింతల్ బస్తీ రామ్ లీలా గ్రౌండ్, అన్నపూర్ణ టెంపుల్ గుడిమల్కపూర్, , సర్కిల్ 17లో సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సర్కిల్ 18లో సక్కుబాయి లే అవుట్ షేక్ పెట్ ఏర్పాటు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+