టీ ఎన్నిక‌ల‌పై ఆంధ్రా ఆక్టోప‌స్ అంచనాలు తారుమారు..! విమ‌ర్శ‌ల పాల‌వుతున్న ల‌గ‌డ‌పాటి స‌ర్వే.!!

Recommended Video

    Telangana Exit Polls Survey 2018 : టీ ఎన్నిక‌ల‌పై ఆంధ్రా ఆక్టోప‌స్ అంచనాలు తారుమారు..! | Oneindia

    హైద‌రాబాద్ : ఆంద్ర ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల జ‌రిగిన రోజునే ప్ర‌జ‌ల‌కు క‌నిపిస్తారు. ముంద‌స్తు ఎన్నికల ఫ‌లితాల‌ను విశ్లేషించ‌డంలో ఘ‌నాపాటి. కాని ఈ సారి 2018 తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మాత్రం త‌న విశ్లేష‌ణ‌పై పెద్ద యెత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఐదు రాష్ట్రాల‌కు ఎన్నికలు జ‌రిగితే కేవ‌లం తెలంగాణ మీద ద్రుష్టి కేంద్రీక‌రించిన‌ప్ప‌టికి గ‌తంలో రాజ‌గోపాల్ స‌ర్వే మార్క్ మాత్రం ఈ ఎన్నిక‌ల ముంద‌స్తు ఫ‌లితాల ప్ర‌కట‌న‌లో క‌నిపించ‌ర‌లేద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

    సంయ‌మ‌నం కోల్పోయి ఫ‌లితాలు చెప్పారు..! ల‌గ‌డ‌పాటి పై తీవ్ర విమ‌ర్శ‌లు..!

    సంయ‌మ‌నం కోల్పోయి ఫ‌లితాలు చెప్పారు..! ల‌గ‌డ‌పాటి పై తీవ్ర విమ‌ర్శ‌లు..!

    తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను అంచ‌నా వేయ‌డంలో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ సంయ‌మ‌నం కోల్పోయార‌ని. ఎవ‌రి ప్ర‌లోభాల‌కో లొంగిపోయి ముంద‌స్తు ఎన్నికల అంచ‌నాలు విడుద‌ల చేసార‌ని కొంత మంది రాజ‌కీయ నేత‌లు ఘాటుగా విమ‌ర్శిస్తున్నారు. ఎగ్సిట్ పోల్స్ వివ‌రించేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన ల‌గ‌డ‌పాటి అభ‌ద్ర‌తా భావంలో ఉన్న‌ట్టు క‌నిపించింద‌ని, ఆత్మ స్ద‌యిర్యంతో ఎన్నిక‌ల ఫ‌లితాల అంచ‌నాల‌ను విడుద‌ల చేసిన‌ట్టు లేద‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ల‌గ‌డ‌పాటి విడుద‌ల చేసిన ముంద‌స్తు ఎన్న‌కల ఫ‌లితాల అంచ‌నాలు ఆయ‌న క్రెడిబులిటీని దెబ్బ‌కొట్టే విధంగా ఉన్నాయ‌ని కొంత మంది నేత‌లు ఆరోపిస్తున్నారు.

    మ‌ళ్లీ తెలంగాణ పై అవ‌స్త‌వాలు చిమ్మిన ల‌గ‌డ‌పాటి..! ఎగ్సిట్ పోల్స్ లో వాస్త‌వాలు లేవ‌ని విమ‌ర్శ‌లు..!

    మ‌ళ్లీ తెలంగాణ పై అవ‌స్త‌వాలు చిమ్మిన ల‌గ‌డ‌పాటి..! ఎగ్సిట్ పోల్స్ లో వాస్త‌వాలు లేవ‌ని విమ‌ర్శ‌లు..!

    ప్ర‌జాకూట‌మి వ‌ర్సెస్ - టీఆర్ఎస్ కురుక్షేత్రంలో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌మ్మెట‌పోట్ల‌కు న‌లిగిపోతున్నారు. ఆయ‌న డ‌బ్బులు ఖ‌ర్చుపెట్టుకుని మ‌రీ స‌ర్వే ద్వారా జ‌నాల‌తో దూష‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. నిజంగా ఇదొక విచిత్ర‌మే. అత‌ను గ‌తంలో రాజ‌కీయ నాయ‌కుడే కావ‌చ్చు గాని పోలింగ్ ముగిసిన త‌ర్వాత అబ‌ద్ధాలు చెబితే ఆయ‌న‌కేం వ‌స్తుంది? ఇది లాజిక్‌. పైగా ఉత్తినే త‌న క్రెడిబులిటీ పోగొట్టుకోవాల‌ని అత‌ను ఎందుకు అనుకుంటారు? కానీ దీన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆయ‌న‌పై చాలా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

    ల‌గ‌డ‌పాటి త‌డ‌బ‌డ్డారు..! కొంద‌రి ప్ర‌యోజ‌నాల కోసమే ఫ‌లితాలు చెప్పార‌ని ఆరోప‌ణ‌లు..!

    ల‌గ‌డ‌పాటి త‌డ‌బ‌డ్డారు..! కొంద‌రి ప్ర‌యోజ‌నాల కోసమే ఫ‌లితాలు చెప్పార‌ని ఆరోప‌ణ‌లు..!

    ల‌గ‌డ‌పాటి ధైర్యంగా చెప్ప‌లేక‌పోతున్నార‌ని, మాట్లాడేట‌పుడు త‌డ‌బ‌డుతున్నాడ‌ని అన్న టీఆర్ఎస్ నేత సీతారాం నాయ‌క్ ల‌గ‌డ‌పాటి స‌ర్వేను అనుమానించారు. అంతేకాదు, ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల‌న్నీ టీఆర్ఎస్‌కే ప‌ట్టం క‌ట్టాయ‌ని, ల‌గ‌డ‌పాటి మూడు నెల‌ల నుంచి క్షేత్ర స్థాయిలో స‌ర్వే చేసినా ఎందుకంత‌ త‌డ‌బడుతున్నార‌ని ప్ర‌శ్నించారు. ఒక ఫిగ‌ర్ ని నిర్దారించి చెప్ప‌లేక‌పోతున్నారని, టీఆర్ఎస్‌కు 35 కు అటు ప‌ది ఇటు ప‌ది అంటున్నాడు. దీనికి ఏం క్రెడిబులిటీ ఉంటుంది? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతే కాకుండా తెలంగాణ ప్ర‌జానికంలో కూడా ల‌గ‌డ పాటి స‌ర్వే ఓ జోక్ గా మిగిలిపోయింది త‌ప్ప ఎలాంటి ప్రాముఖ్య‌త ల‌భించ‌లేదు.

    ఆంధ్రా ఆక్టోప‌స్ అంచానాలు తారుమారు..! సంఖ్య‌ను ఖ‌చ్చితంగా చెప్ప‌లేకపోతున్నార‌ని విమ‌ర్శ‌లు..!

    ఆంధ్రా ఆక్టోప‌స్ అంచానాలు తారుమారు..! సంఖ్య‌ను ఖ‌చ్చితంగా చెప్ప‌లేకపోతున్నార‌ని విమ‌ర్శ‌లు..!

    బీజేపీ కి చెందిన మ‌రో నేత విష్ణువ‌ర్ద‌న్‌రెడ్డి కూడా దీనిపై స్పందించారు. అది టీడీపీ ఆఫీసులో వండిన స‌ర్వే అని కొట్టి పారేసారు. బీజేపీకి 7 కాదు, ప‌ది స్థానాలు వ‌స్తాయని. తెలంగాణ‌లో హంగ్ వ‌స్తుందని, తెలంగాణ‌లో తాము లేకుండా ప్ర‌భ‌త్వ‌మే ఏర్ప‌డ‌దన్నారు. ల‌గ‌డ‌పాటిని టీడీపీ వాళ్లు అంత భుజానికి ఎత్తుకోవాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. ల‌గ‌డ‌పాటి త‌న క్రెడిబులిటీ పోగొట్టుకున్నార‌ని విష్ణు వ్యాఖ్యానించారు. ఈ నెల 11 సాయ‌త్రం వ‌ర‌కు ల‌గ‌డ‌పాటి పాటి నిర్వ‌హించిన స‌ర్వే ఎంత‌టి పార‌ద‌ర్శ‌క‌త సంత‌రించుకుంటుందో తేట తెల్లం అవుతుంద‌ని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+