హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణా సర్కార్ మరో కీలక నిర్ణయం .. కరోనా కంట్రోల్ కోసం బస్సుల్లో హ్యాండ్ శానిటైజర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణాలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తెలంగాణా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఆరు కేసులు నమోదు అయ్యాయి. ఇక చాలా మంది కరోనా అనుమానితులు ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నారు. ఇక కరోనా వైరస్ కు సంబంధించిన లక్షణాలు సాధారణమైన జలుబు, దగ్గు , జ్వరం వంటి లక్షణాలే కావటంతో ఎవరికి కరోనా ఉంది ఎవరికి లేదు అనేది కనిపెట్టటం ఇబ్బందిగా మారింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

తెలంగాణాలో ఆరుకు చేరిన కరోనా బాధితులు: బ్రిటన్ నుండి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్తెలంగాణాలో ఆరుకు చేరిన కరోనా బాధితులు: బ్రిటన్ నుండి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్

ఇక ప్రయాణాలు చేసే వారికి కరోనా ప్రభావం లేకుండా బస్సుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణా సర్కార్ సూచిస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం అటు ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతుంది. ఇక ఈ నేపధ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణా ప్రభుత్వం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా ముఖ్యంగా ఆర్టీసీపై కూడా దృష్టి సారించింది. తాజాగా ఆర్టీసీ కండక్టర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలిచ్చింది. ఇకపై కండక్టర్లు తప్పనిసరిగా తమ దగ్గర హ్యాండ్ శానిటైజర్లను ఉంచుకోవాలని ప్రభుత్వం తెలిపింది.

Another key decision of Telangana government .. Hand sanitizers in buses

Recommended Video

5 Minutes 10 Headlines || KCR Nominates Kavitha As MLC || Virus Impact On Indians Abroad

బస్సులో ప్రయాణించే ప్రయాణీకులకు రెండు చుక్కలు వాళ్ల చేతుల్లో వేసి రాసుకోమని సూచించాలని చెప్పింది. ఇక బస్సుల్లో హ్యాండ్ శానిటైజర్లను ఆర్టీసీ యాజమాన్యమే అందించనుంది. తద్వారా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు సాధ్యమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే బస్సుల్లో కండక్టర్లకు టికెట్లు ఇవ్వటమే కాక హ్యాండ్ శానిటైజర్లను ఇవ్వాలని పెద్ద పని పెట్టింది. ఏది ఏమైనా ఈ తరహా నిర్ణయాలు ఏ మేరకు ఫలితాలిస్తాయో కానీ రాష్ట్రంలో మాత్రం కరోనా కలకలం తగ్గటం లేదు. కరోనా కంట్రోల్ కోసం ప్రభుత్వమే కాదు ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

English summary
Corona is terrifing Telangana state.Telangana government suggests that travelers should take good care of buses without corona effect. The number of corona cases in Telangana state is on the rise, causing tension to the government. Another key decision taken by the Telangana government in this context is to focus on the rapid spread of coronavirus, especially on RTC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X