హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో కేసు.. జగిత్యాల జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్.. మొగిలిపేటలో

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతుంది. కానీ కేసులు మాత్రం మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చేవారి వల్ల కేసులు బయటపడుతున్నాయి. రిపోర్ట్ వచ్చేవారికి వారిని ఎయిర్ పోర్టు వద్ద ఉంచితే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ బయటకు వదలడం.. వారు ఇంటికి రావడం జరుగుతుంది. దీంతో కేసులు పెరుగుతున్నాయి. జగిత్యాల జిల్లాలో మరో ఒమిక్రాన్ వెలుగుచూసింది. ఇటీవల ఒక కేసు వచ్చిన సంగతి తెలిసిందే.

మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చెందిన ఒకరికి కేసు వచ్చింది. అతను ఈ నెల 1వ తేదీన దుబాయ్ నుంచి గ్రామానికి వచ్చాడు. శాంపిల్ ఇవ్వగా.. ఇవాళ ఒమిక్రాన్ నిర్ధారణ జరిగింది. అతనిని చికిత్స కోసం టిమ్స్ తరలించారు. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. విధిగా మాస్క్ ధరించాలని స్పష్టంచేశారు. భౌతిక దూరం కంపల్సరీ అని స్పస్టంచేశారు.

another omicron case has found at jagtial district

ఇటు మొన్న మెట్ పల్లి చావిడి వద్ద కూడా ఒకరికి ఒమిక్రాన్ సోకింది. అతనిని వైద్యులు టిమ్స్ తరలించారు. దీంతో నియోజకవర్గంలో అలజడి నెలకొంది. అతని ఆరోగ్యం మెరగుపడినట్టే ఉంది. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకునే సమయంలో మరో కేసు వెలుగుచూసింది. దీంతో ఏం జరుగుతుందోననే హై టెన్షన్ నెలకొంది.

కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అందుకు తగిన జాగ్రత్తలను తీసుకుంటుంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టంచేసింది. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఒమిక్రాన్ వైరస్ వాయువేగంతో వ్యాపిస్తోంది. ఒకరికి సోకితే.. ఆ ఫ్యామిలీకి దాదాపుగా వస్తోంది. సన్నిహితంగా మెలిగితే చాలు వైరస్ వస్తోంది.

ఒమిక్రాన్ టెన్షన్‌తో నైట్ కర్ఫ్యూ వచ్చేసింది. చాలా రాష్ట్రాలు రాత్రి పూట కర్ప్యూను ప్రకటించాయి. ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.

English summary
second omicron case has found at jagtial district mogilipet. he recently came to dubai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X