మా కూతురు వివాహానికి రండి: కేసీఆర్‌కు అసదుద్దీన్ ఒవైసీ ఆహ్వాన పత్రిక
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తన కూతురు వివాహానికి రావాల్సిందిగా కేసీఆర్‌కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో ఆయనను కలిశారు అసదుద్దీన్ ఒవైసీ. త్వరలో జరగనున్న తన కుమార్తె వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరారు.
కాగా, సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. సర్దార్ పటేల్ మార్గ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు టీఆర్ఎస్ పేరును ఇటీవలే బీఆర్ఎస్‌గా మార్చారు.

ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో రెండ్రోజుల క్రితం రాజశ్యామల యాగం కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జేడీఎస్ నేత కుమారస్వామి, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఇతర పార్టీలకు చెందిన నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు హాజరై కేసీఆర్ కు అభినందనలు తెలిపారు.
జాతీయ రాజకీయాలపై ఈ సందర్భంగా కేసీఆర్ వారితో చర్చించారు. బీఆర్ఎస్ జాతీయ రైతు విభాగాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుని, లేదా ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉంది. మొదట కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ పార్టీతో కలిసి బీఆర్ఎస్ పోటీ చేస్తుందని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications