పవన్ కళ్యాణ్ టార్గెట్ గా.. ఏపీలో పనికి రాని వ్యక్తితో గ్రేటర్ రాజకీయాలా .. బాల్క సుమన్ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేస్తామని ముందు ప్రకటించి, తర్వాత అస్త్రసన్యాసం చేసిన పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు టిఆర్ఎస్ నాయకులు. బిజెపికి మద్దతుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తున్నారు.

పవన్ ను టార్గెట్ చేసిన టీఆర్ఎస్ నేత బాల్క సుమన్
ఏపీలో గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఎన్నికల బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ఓటమి పాలు కావడం ఏపీ లోనే కాకుండా, తెలంగాణ రాష్ట్రంలోనూ టార్గెట్ అవుతోంది.పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన, బీజేపీల గ్రేటర్ ఎన్నికల రాజకీయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ ప్రశాంతంగా ఉంటే, ప్రతిపక్ష పార్టీలలో రెబెల్స్ లొల్లి తో గందరగోళం నెలకొంది అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పవన్ రాజకీయాలు దేనికో
టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో 50 శాతానికి పైగా డిగ్రీ పూర్తి చేసిన వారు ఉన్నారని, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు ప్రజలకు కామెడీ షో లా అనిపిస్తున్నాయి అని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇస్తూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రాజకీయాలు చేయడం ఏంటి అని ప్రశ్నించిన బాల్క సుమన్ ఏపీలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదని, రాష్ట్రంలో జనసేన పార్టీ కేవలం ఒకే స్థానానికి పరిమితమైందని ఎద్దేవా చేశారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయన వెంట లేరన్నారు .

అక్కడ పనికిరానోళ్ళు ఇక్కడ పనికొస్తారా ?
పక్క రాష్ట్రంలో దేనికి పనికి రాని వ్యక్తితో హైదరాబాద్ లో రాజకీయాలు చేయటం ఏమిటో వాళ్ళకే తెలియాలని బాల్క సుమన్ కౌంటర్ వేశారు. పవన్ కళ్యాణ్ అక్కడ ఏం చేయలేనోడు ఇక్కడ ఏం చేస్తాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన బాల్క సుమన్ విస్తృత ప్రయోజనాల కోసం పోటీ చేయటం లేదంట అంటూ పవన్ మాట్లాడే మాటలకు జనాలు నవ్వుతున్నారు అని పేర్కొన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నిస్సహాయుడు అని, అందుకే రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్లి అడుక్కుంటున్నాడు అంటూ మండిపడ్డారు .

కేంద్రం రాష్ట్రానికి చేసిందేంటి ?
టికెట్ల కేటాయింపులో టిఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తే, ప్రతిపక్ష పార్టీలలో ఇంకా లొల్లి తగ్గడం లేదంటూ పేర్కొన్నారు.ఇక బిజెపిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన బాల్క సుమన్ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు అన్నీ మావే అని ప్రచారం చేస్తున్న కేంద్రం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ముందు నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలు టీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
Recommended Video

బీజేపీ ఎంపీలు ఏం చేశారు ? పసుపు బోర్డు వచ్చిందా
దమ్ముంటే అభివృద్ధిపై మాట్లాడాలని సవాల్ విసిరారు బాల్క సుమన్. ఇక రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షుడి హోదాలో ఉందా వ్యవహరించాలంటూ బాల్క సుమన్ పేర్కొన్నారు . బీజేపీ లో గెలిచిన నలుగురు ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారు అని ప్రశ్నించారు. నిజామాబాద్లో పసుపు బోర్డు తీసుకువచ్చారా అంటూ ప్రశ్నించిన బాల్క సుమన్ ఎన్నికలలో గ్రేటర్ వాసులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్తారు అంటూ అభిప్రాయపడ్డారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications