హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంజారాహిల్స్ పీఎస్‌కు న్యూ సీఐ.. నాగేశ్వరరావు అంతకుముందు ఎక్కడ పనిచేశారంటే..?

|
Google Oneindia TeluguNews

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు కొత్త సీఐ నాగేశ్వరరావు వచ్చారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ సీఐగా ఉన్న నాగేశ్వరరావు.. గత ఆరేళ్ల నుంచి అందులో పనిచేస్తున్నారు. పబ్‌లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది నాగేశ్వరరావు టీమే. గతంలో ఎన్నో సంచలన కేసుల గుట్టు తేల్చారు. కేసు విచారణ నాగేశ్వరరావు చేపట్టనున్నారు. అంతకుముందు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ శివచంద్రను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. శివచంద్రపై గతంలో పలు సెటిల్‌మెంట్‌ ఆరోపణలు, పబ్‌లపై నిఘా పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో సస్పెన్షన్‌ వేటు పడింది.

అంతేకాదు కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఐ శివచంద్ర అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియాతో మాట్లాడకుండా నిరాకరించడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖులు ఉన్నారని తేలడంతో పోలీసులు కేసును సవాల్ గా తీసుకున్నారు. డ్రగ్స్ విషయంలో నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. దీంతో ఇతడిని సీఐగా నియమిస్తే, కేసు ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.

banjara hills ps new ci is nageshwar rao. he is investigate pub drug case.

ఎంత డ్రగ్స్ పట్టుబడిందో తెలియరాలేదు. 142 మంది పేర్లు బయటకు వచ్చాయి. వీరందరికీ నోటీసులు జారీ చేశారు. ఇందులో 45 మంది కీలక పాత్ర పోషించారని, వీరి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారని తెలుస్తోంది. వీరి విషయంలో సీరియస్ గా దర్యాప్తు చేయనున్నారు. డ్రగ్స్‌ పార్టీ కేసులో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూడా ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. పార్టీ చోటు చేసుకున్న రాడిసన్‌ హోటల్‌ రూమ్స్‌లో సోదాలు చేస్తున్నారు. డ్రగ్‌ ఆర్గనైజర్లు, హోటల్‌ రూమ్స్‌ నుంచే పార్టీకి వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డ్రగ్స్ కలకలంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ పోలీసు అధికారులతో అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెస్ట్‌జోన్‌ పరిధిలోని ఆయా పోలీస్‌స్టేషన్లకు చెందిన సెక్టార్స్ ఎస్సై, డిటెక్టివ్‌ ఇన్స్‌పెక్టర్లను రిపోర్ట్ చేయాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు.

English summary
banjara hills ps new ci is nageshwar rao. he is investigate pub drug case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X