కరోనాతో బ్యాంక్ మేనేజర్ మృతి ... టెన్షన్ లో బ్యాంక్ సిబ్బంది
తెలంగాణాలో కరోనా కేసులు ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కరోనాకు హాట్ స్పాట్ గా మారింది. రాష్ట్రం అంతా కేసులు తగ్గుతున్నా హైదరాబాద్ లో మాత్రం కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా వైరస్ కేసులన్నీ దాదాపుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 1,551 కేసులు నమోదు కాగా ఇందులో ఒక్క హైదరాబాద్ లోనే 981కేసులు నమోదు అయ్యాయి. ఇక ఆదివారం కొత్తగా ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 37 కేసులను గుర్తించారు .
కరోనా కేసులు పెరుగుతున్న భాగ్యనగరంలో తాజాగా ఒక బ్యాంక్ మేనేజర్ కరోనా పాజిటివ్ కారణంగా మృతి చెందటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కరోనాతో దేశం అంతా లాక్ డౌన్ విధించిన బ్యాంకులు మాత్రం లావాదేవీలు కొనసాగించాయి. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నా సరే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పని చేస్తున్నారు బ్యాంకుల సిబ్బంది . తమ ప్రాణాలకు రక్షణ లేదని లబోదిబోమంటున్నారు .అయితే తాజాగా కోఠిలోని ఓ బ్యాంక్ మేనేజర్ కరోనా పాజిటివ్ కారణంగా ప్రాణాలు వదిలారు. మేనేజర్ కరోనా వల్ల చనిపోవడంతో ఆ బ్యాంకులో పని చేస్తున్న సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.

ఇక బ్యాంకు మేనేజర్ కు కరోనా వైరస్ సోకటానికి కారణం ఎవరో తెలీలేదు , అంతేకాదు ఆయనతోకలిసి ఇన్ని రోజులుగా కలిసి పని చేయడంతో ఎవరికి వైరస్ సోకిందో అన్న ఆందోళనలో బ్యాంకు సిబ్బంది సైతం భయపడుతున్నారు. ఇక అధికారులు కూడా గత కొద్ది రోజులుగా బ్యాంకు మేనేజర్‌ను ఎవరెవరు కలిశారనే వివరాలను సేకరిస్తున్నారు. ఆయనతో కాంటాక్ట్ అయిన వారందర్నీ క్వారంటైన్ కు తరలించారు.












Click it and Unblock the Notifications