బీసీ డి కులాన్ని బీసీ ‘ఎ’లోకి మార్చాలి, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి: బీసీ కమిషన్ ఛైర్మన్ డిమాండ్
హైదరాబాద్: బీసీ డీ కులాన్ని బీసీ 'ఏ' లోకి మార్చాలని ప్రభుత్వాన్ని బీసీ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. పేదకులంలోని నిరుపైదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని, బీసి సామజిక వర్గానికి గుర్తింపు రావాలంటే సంఘటిత శక్తిని ప్రదర్శించాలన్నారు 130 కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ కమీషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్.
బలమైన శక్తే సమాజాన్ని శాసిస్తుందని, కాబట్టి రాజకీయంలో ప్రాతినిథ్యం వహించాలని బీసి వర్గాల్లో రాజకీయ చైతన్యం రావాలన్నారు వకులాభరణం. ఈ సామజిక వర్గానికి ఒక ప్రత్యేకమైన కులవృత్తి లేకపోవడం, ఆశించిన రీతిలో గుర్తింపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల ఐక్యతకోసం ఓ చైతన్య సదస్సును వకులాభరణం క్రిష్ణమోహన్ నిర్వహించారు.

ఈ సదస్సులో సభ్యుల సంక్షేమానికి చేస్తున్న సేవలను, ప్రభుత్వం నుంచి తమ సంఘానికికావాల్సిన అభివృద్ధి పథకాల పై అవగాహన కల్పించామన్నారు వకులాభరణం. అనంతరం చాత్తాదశ్రీ వైష్ణవ పండితులకు సన్మానం చేయడంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్య్రమానికి టీవీ, ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఛైర్మెన్ అనిల్ కూర్మచలం, పర్యాద కృష్ణమూర్తి, సంఘం జాతీయ అధ్యక్షుడు రామానుజం, జనరల్ సెక్రెటరీ రాజేందర్, జాతీయ ప్రచార కమిటీ సెక్రటరీ కాజీపేట నరేందర్ తదితరులు పాల్గొన్నారు. స్వార్థ చింతన లేకుండా నవ సమాజ నిర్మాణంలో సమిధలుగా మిగిలిన చాత్తాద శ్రీ వైష్ణవులకి తగిన గుర్తింపు లేక రాజకీయంగాను, సామాజికంగానూ వెనుకబడిన తరగతులలో ఎటువంటి ప్రాతినిధ్యం లేక కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్షిప్పులు ప్రధానం చేసి సన్మానం నిర్వహించారు.












Click it and Unblock the Notifications