Bigg Boss Nominations: ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్ ఇదే: మళ్లీ వాళ్లే
హైదరాబాద్: వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. రోజులు గడుస్తున్న కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ఏడోవారంలోకి అడుగు పెట్టింది. బిగ్‌బాస్ హౌస్‌లో టాస్క్, ఆ సమయంలో వారి మధ్య ఏర్పడే ఎమోషన్స్ పాటు టీవీక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోన్నాయి. వీకెండ్ వచ్చే సరికి అంచనాలకు ఏ మాత్రం అందని విధంగా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్నారు. హమీద ఖాతూన్, శ్వేతావర్మ.. ఇలా ఎలిమినేట్ అయిన వారే.

నామినేట్ ప్రాసెస్..
హౌస్ నుంచి బయటికి వెళ్లే కంటెస్టెంట్లను ఎంపిక చేసే ప్రక్రియ ప్రతి సోమవారం ఉంటుంది. తమకు నచ్చని లేదా స్ట్రాంగ్ కాంపిటిటర్‌గా భావించిన వారిని కంటెస్టెంట్లు నామినేట్ ప్రాసెస్ కోసం సెలెక్ట్ చేస్తుంటారు. ఇదివరకు ఎప్పుడూ పెద్దగా లేనివిధంగా ఓ కొత్త ఫార్ములాను బిగ్ బాస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అయిదు లేదా ఆరుమందిని నామినేట్ చేస్తుండే వారు. అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఏడో వారం ఎలిమినేషన్స్ కోసం ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారు.

మళ్లీ వారే..
ఈ వారం కూడా ఎనిమిదిమంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చారు. ఆర్జే కాజల్, యాంకర్ రవి, సిరి హన్మంతు, ప్రియా, అనీ మాస్టర్, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జస్వంత్ ఈ వారం నామినేట్ అయ్యారు. సీక్రెట్ హౌస్‌లో ఉంటోన్న లోబో నేరుగా ఎలిమినేషన్స్‌లోకి వస్తాడు. వారిలో ఆర్జే కాజల్ మినహా మిగలిన వారందరూ వరుసగా నామినేట్ అవుతూ వస్తోన్నారు. మరోసారి వారంతా డేంజర్ జోన్‌లో నిలిచారు. ఎలిమినేట్ అయ్యే థ్రెట్‌ను ఎదుర్కొంటున్నారు.

నేరుగా నామినేషన్స్‌లోకి
ఈ రియాలిటీ షో సెవెన్త్ వీక్‌లో అడుగు పెట్టింది. దానికి అనుగుణంగా కంటెస్టెంట్ల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. శ్వేతావర్మతో కలుపుకొని ఇప్పటిదాకా ఆరుమంది ఎలిమినేట్ అయ్యారు. లోబో సీక్రెట్ రూమ్‌కు పరిమితం అయ్యాడు. కంటెస్టెంట్ల సంఖ్య 19 నుంచి 12కు పడిపోయింది. సీక్రెట్ రూమ్‌లో బందీగా ఉంటోన్న లోబో బిగ్‌బాస్ మెయిన్ హౌస్‌లో అడుగు పెట్టడానికి ఇంకా నాలుగు రోజుల గడువు ఉంది. శనివారం అతను మెయిన్ హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

తక్కువ ఓట్లు
రెండు-మూడు వారాలుగా లోబో, ప్రియా, సిరి హన్మంతుకు తక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయి. అలాగే- ఇప్పటిదాకా ఎలిమినేట్ అయిన వారిలో అయిదుమంది ఫిమేల్ కంటెస్టెంట్లు ఉన్నారు..ఒక్క నటరాజ్ మాస్టర్ తప్ప. సరయు, ఉమాదేవి, లహరి, హమీదా, శ్వేత వర్మ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లారు. ఈ వారం కూడా ఎలిమినేషన్ కోసం సెలెక్ట్ అయిన ఎనిమిది మందిలో సగంమంది ఫిమేల్ కంటెస్టెంట్లు ఉన్నారు. ప్రియా, సిరి హన్మంతు, ఆర్జే కాజల్, ఆనీ మాస్టర్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ వారం కూడా ఫిమేల్ కంటెస్టెంట్‌పైనే వేటు పడుతుందా? అనే డిబేట్ సోషల్ మీడియాలో సాగుతోంది.

ప్రియ, లోబోపై ఫోకస్..
కిందటివారం హోస్ట్ అక్కినేని నాగార్జున సేకరించిన ఒపీనియన్ ప్రకారం.. మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్ల ఈ ఇద్దరికీ వ్యతిరేకంగా ఉన్నారు. లోబో, ప్రియలకు బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగే అర్హత లేదంటూ తోటి కంటెస్టెంట్లు సైతం అభిప్రాయపడ్డారు. తమ ఒపీనియన్‌ను అక్కినేని నాగార్జునతో షేర్ చేసుకున్నారు. వీక్షకులు కూడా దాదాపు అదే ఒపీనియన్‌తో ఉన్నారని తెలుస్తోంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇప్పటి నుంచి ఆసక్తిగా మారుతోంది. డిబేట్లకు దారి తీస్తోంది.
Recommended Video

కంటిన్యూగా..
తాజాగా నామినేషన్స్‌లో వచ్చిన వారిలో ఆర్జే కాజల్ మినహా మిగిలిన వారందరూ వరుసగా ఎలిమినేషన్ ప్రక్రియ కోసం ఎంపిక అవుతూనే వస్తోన్నారు. తక్కువ ఓట్ల శాతాన్ని నమోదు చేస్తోన్నారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌తో పోల్చుకుంటే.. వారికి పడుతోన్న ఓట్ల షేర్ కాస్త ఎక్కువగా ఉంటోందంతే. నటరాజ్ మాస్టర్ ఎలిమిట్ అయిన సమయంలో లోబో చివరి వరకూ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ప్రియ కూడా అంతే. ఈ ఇద్దరికీ తోటి కంటెస్టెంట్ల నుంచే సపోర్ట్ ఉండట్లేదు. హౌస్‌లో కొనసాగడానికి వారిద్దరూ అన్‌ఫిట్‌గా తేల్చేస్తున్నారు.












Click it and Unblock the Notifications