Bigg Boss Season 7 Telugu : ఈసారి నిరుడు లెక్కుండదు.. టీఆర్పీ రేటింగ్స్ బద్దలు కావడం ఖాయం

Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ పండుగ రానే వచ్చేసింది. టెలివిజన్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్‌బాస్ మరో సీజన్‌కు సిద్ధం అవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ప్రారంభం కూడా అయ్యాయి. తాజాగా బిగ్‌బాస్ 7వ సీజన్‌కు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

బిగ్‌బాస్ వంటి రియాలిటీ షో తెలుగులో హిట్ అవుతుందా ..? అనే అనుమానం మొదట్లో అందరికి కలిగింది. కాని మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో..వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకపోయింది. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో తరువాత సీజన్‌లపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్.. హోస్ట్‌గా చేయగా.. రెండో సీజన్‌కు హీరో నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక మూడో సీజన్‌ నుంచి కింగ్ నాగార్జుననే బిగ్‌బాస్ హోస్ట్‌గా కొనసాగుతున్నారు.

Bigg Boss Season 7 Telugu

7వ సీజన్‌కు హోస్ట్‌ మారుతున్నారని ప్రచారం జరిగినప్పటికీ కూడా ..తాజాగా విడుదలైన ప్రొమోలో నాగార్జుననే దర్శనం ఇవ్వడంతో.. ఆయనే హోస్ట్‌గా కన్ఫర్మ్ చేసినట్లు అయింది. మొదటి నాలుగు సీజన్లు బాగానే ఉన్నప్పటికీ.. తరువాత వచ్చిన సీజన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. బాగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన ఆర్టిస్టులు పెద్దగా ఫేమస్ కాకపోవడం..బిగ్‌బాస్ ఆడించే గేమ్స్ అంతగా ఆసక్తికరంగా లేకపోవడం ఇలా అన్ని కలిసి.. బిగ్‌బాస్ షోని నాశిరకంగా మార్చేశాయి. దీనిని గ్రహించిన షో యాజమాన్యం తగు చర్యలు తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది.

Bigg Boss Season 7 Telugu

గతంలో ఎప్పుడూ లేనంతగా షోని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రొమోలో ఇదే విషయాన్ని చెప్పారు. రాధ - రమేష్ పాత్ర ప్రేమ జంట చూట్టు ఓ వీడియోను కట్ చేశారు.రమేష్ కొండ మీద నుంచి జారి పడబోతుంటే రాధ తన చున్నీ ఇచ్చి పట్టుకోమంటుంది. ఇది నాగార్జునకు నచ్చలేదు. ఇలాంటి సీన్స్ మనం ఎన్నో క్లైమాక్స్‌లో చూశాం. ఎండింగ్ మార్చేద్దాం అంటూ చిటికేస్తే, రాధకు తుమ్ము వచ్చి చున్నీ వదిలేస్తుంది ..రమేష్ లోయలోకి పడిపోతాడు. దీనిని బట్టి చూస్తే ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్‌లు, ఎండింగ్‌‌లు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు అర్ధం అవుతుంది.

Bigg Boss Season 7 Telugu

ఈ సీజన్‌తో షోకి పూర్వ వైభవం తీసుకురావాలని నిర్వాహకులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో కంటెస్ట్‌లను సైతం ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తలు వహించినట్టు సమాచారం. ఫేమస్ యాకర్ట్స్‌తో పాటు, కపుల్స్‌ను కూడా ఈసారి ఎంపిక చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే బిగ్‌బాస్ ఏడో సీజన్ టీఆర్పీ రేటింగ్ బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తుంది. మరి బిగ్‌బాస్ ఏడో సీజన్ ఎలాంటి సంచనాలను సృష్టిస్తోందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+