Bigg Boss Telugu:దివి ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే..అలా చేసి ఉంటే ఫైనల్స్‌కు పక్కా..కానీ..!
హైదరాబాద్ : బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో ఎలిమినేషన్ ప్రక్రియపై చాలా అపోహలు కలుగుతున్నాయి. అయినప్పటికీ ప్రతి వారం ఎలిమినేషన్ తప్పకుండా జరుగుతోంది. ఏడవ వారంలో దివి వద్యా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే దివి పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని అయితే ఎందుకు ఆమెను ఇంటినుంచి పంపివేశారని నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారికోసం దివి చేసిన నాలుగు తప్పులు గురించి షోను రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నవారు చెబుతున్నారు. ఇంతకీ దివి చేసిన ఆ నాలుగు తప్పులేంటి..?
Bigg Boss Telugu:హౌజ్‌లోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ-ఎవరా సెలబ్రిటీ, ఇక షో రేటింగ్స్ తారాస్థాయికి..!

హౌజ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ దివి
బిగ్‌బాస్ హౌజ్‌లో దివి వద్యా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందింది. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా తనకు అప్పగించిన టాస్కును సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తూ అదే సమయంలో ప్రేక్షకుల మన్ననలు సైతం పొందింది. కానీ దురదృష్టవశాత్తు దివి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాల్సి రావడంతో నెటిజెన్లు భగ్గుమన్నారు. మోనాల్‌ను సేవ్ చేసేందుకు ఇంకా ఎంతమందిని బలి చేస్తారని బాహాటంగానే నిప్పులు చెరుగుతున్నారు. అయితే దివిని ఎలిమినేట్ చేయడానికి కచ్చితమైన కారణాలు అయితే కనిపించడం లేదు కానీ... పలువురు మాత్రం కొన్ని కారణాలను చూపిస్తున్నారు.

స్నేహం ముసుగులో అలా..
బిగ్‌బాస్ తెలుగు నాల్గవ సీజన్ అఖిల్ - మోనాల్ మధ్య లవ్ ట్రాక్‌తో ప్రారంభమైంది. హౌజ్‌లో ఇతర కంటెస్టెంట్లు మాత్రం సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఉదాహరణకు అవినాష్ - అరియానా, అభిజీత్-హారికాలు అద్భుతమైన సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఈ మూడు జోడీలు మంచి ఫ్రెండ్స్ అని చూసిన ప్రేక్షకులకు అర్థమైపోయింది. ఏదైనా మంచి అండర్‌స్టాండింగ్‌తో కలిసి వీరు హౌజ్‌లో కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇదే వారికి అడ్వాంటేజ్‌గా మారుతోందని చెప్పొచ్చు. ఇక దివి విషయానికొస్తే ఆమె చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అంతేకాదు స్నేహం ముసుగులో ఆమెకు నటించడం రాదని ఆమెను చూస్తే అర్థమవుతుందంటూ ప్రేక్షకులు చెబుతున్నారు. దివి తన గురించి తాను ఆలోచించుకునే మనస్తత్వం కలదని, ఒదిగి ఉంటుందని, ఇతరులతో అంత తొందరగా కలసిపోయే స్వభావం తనది కాదని చెబుతున్నారు.

అమ్మ రాజశేఖర్‌తోనే కనిపించిన దివి
ఇక బిగ్‌బాస్ షోలో కేవలం అమ్మ రాజశేఖర్‌తోనే దివి చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యింది. ఇక గేమ్ సమయంలో మిగతా హౌజ్‌మేట్స్‌తో కలిసి ఆడాల్సి ఉండగా.. వారితో అంత ర్యాపోను మెయిన్‌టెయిన్ చేయలేదని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా ఆమె ఎలిమినేట్ అయ్యేందుకు ఒక కారణంగా చెబుతున్నారు. ఇక ప్రేక్షకులను అలరించేందుకు గాను, కెమెరా ఫోకస్ తనపై ఉండేలా చేసే పనులు ఏమీ చేయలేదని... అలా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం దివికి ఇష్టం లేదని నెటిజెన్లు చెబుతున్నారు. ఆటను ఆటలాగే ఆమె ఆడారని ఒరిజినాలిటీ కోసమే దివి ప్రయత్నించిందని చెబుతున్నారు. ప్రేక్షకులను స్వచ్ఛమైన గేమ్‌తోనే ఆకట్టుకునే ప్రయత్నం దివి చేసింది. అయితే ఇక్కడ ప్రేక్షకులను కాకుండా షో నిర్వాహకులను దివి ఇంప్రెస్ చేయడం మరిచిందని చాలామంది చెబుతున్నారు. ఎందుకంటే ఎలిమినేషన్‌కు వచ్చే సరికి ప్రేక్షకుల అభిప్రాయంతో పనిలేకుండా నిర్వాహకులు కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇది కూడా బహుశా తన ఎలిమినేషన్‌కు ఒక కారణమై ఉండొచ్చని తెలుస్తోంది.

దివికి జోడీ ఎవరూ లేరు.. మైనస్ అయ్యింది
ఇక దివిలో మరో మైనస్ పాయింట్‌ను నెటిజెన్లు ఎత్తి చూపారు. అమ్మ రాజశేఖర్‌పై ఫోకస్ చేసిన దివి తన సొంత గేమ్‌ను సరిగ్గా ఆడటం మరిచిందని చెబుతున్నారు. హౌజ్‌లో ఇతర కంటెస్టెంట్లతో ఆరోగ్యకరమైన సంబంధాలు నడపకపోవడం, ఎక్కువ సమయం అమ్మ రాజశేఖర్‌తోనే కనిపించడం, అదే సమయంలో మరొకరి జోడీగా ఉండటం విఫలమవడం వంటి కారణాలను నెటిజెన్లు చెబుతున్నారు. ఈ కారణాలతోనే దివి ఎలిమినేట్ అయి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాలను సోషల్ మీడియాలో నెటిజెన్లు చర్చించుకుంటున్నారు.