హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bigg Boss Telugu 4 షాకింగ్ -చరిత్రలోనే అత్యధిక టీఆర్పీతో నేషనల్ రికార్డు: నాగ్ ప్రకటన

|
Google Oneindia TeluguNews

ఈ ఏడాది సెప్టెంబర్ 6న బిగ్ బాస్ తెలుగు సీజన్-4 లాంచ్ అయిన తర్వాత నెట్టింట.. 'ఎవర్రా వీళ్లంతా?'అని వాపోయే సోనూసూన్ మెమే ఒకటి విపరీతంగా సర్క్యులేట్ అయింది. సగానికి సగం కంటెస్టెంట్లు జనంలో పెద్దగా గుర్తింపు లేనివాళ్లు కావడం.. హౌస్ లోకి వెళ్లిన అందరూ వీక్ కంటెస్టెంట్లేనని కామెంట్లు వెల్లువెత్తాయి. షోను నడిపించిన విధానం, కొత్తదనంలేమి, పాతవైన బిరంగ్ టాస్కులు, తలతిక్క డైరెక్షన్.. వెరసి బిగ్ బాస్ తెగులు సీజన్ 4 ఒక అట్టర్ ప్లాప్ షో అనే నెగటివ్ టాక్ వచ్చింది. కానీ..

తిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూతిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూ

చప్పగా మొదలై..

చప్పగా మొదలై..

16 మందితో బిగ్‌బాస్ సీజ‌న్ 4 ప్రారంభ‌ం కాగా.. అభిజీత్, అఖిల్, హారిక‌, అరియానా, సొహైల్, దేవి నాగ‌వ‌ల్లి, జోర్దార్ సుజాత‌, గంగ‌వ్వ‌, సూర్య కిర‌ణ్, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, క‌రాటే క‌ళ్యాణి, మెహ‌బూబ్, లాస్య‌, దివి , నోయ‌ల్, మోనాల్‌లు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో సగానికి సగం మంది పెద్దగా పాపులారిటీ లేనివాళ్లు కావడం, టాస్కుల్లో, వ్యవహార శైలిలో పూర్ పెర్మార్మెన్స్ కనబర్చడంతో భిన్నకామెంట్లు వచ్చాయి. అయితే, 60ఏళ్ల వయసులో చలాకీగా వ్యవహరించిన గంగవ్వ షో ప్రారంభంలోనే అందరి మన్ననలు పొందారు. కానీ ఆరోగ్య కారణాల వల్ల ఆమె మధ్యలోనే తప్పుకున్నారు. అయితే..

నేషనల్ రికార్డు..

నేషనల్ రికార్డు..

కారణాలు ఏవైనా సరే, రోజులు గడుస్తున్నకొద్దీ తెలుగు సీజన్ 4 క్రమంగా పుంజుకుంది. ఆశించిన రేటింగులు రాకపోయినా ఎలాగోలా నెట్టుకొచ్చేసింది. కానీ చిట్టచివరిరోజైన గ్రాండ్ ఫినాలే నాడు మాత్రం షాకింగ్ నంబర్లు సాధించింది. అవును, బిగ్ బాస్ తెలుగు 4.. దేశ చరిత్రలో ఏ(భాషలోని) బిస్ సాధించనంతగా టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 20న ఏకబిగిన మూడు గంటలపాటు సాగిన తెలుగు సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకు ఏకంగా నేషనల్ రికార్డు టీవీఆర్ దక్కింది.

గ్రాండ్ ఫినాలేకు 21.7రేటింగ్..

గ్రాండ్ ఫినాలేకు 21.7రేటింగ్..

కరోనా విలయ కాలంలో ప్రేక్షకులు లేకుండా దుబాయ్ వేదికగా ఐపీఎల్ సాగిన సమయంలోనే బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ ప్రారంభం కావడంపై రకరకాల వాదనలు వినిపించాయి. అయితే గతంలో విజయవంతమైన మూడు సీజన్‌ల కంటే సీజన్ 4 ఏకంగా జాతీయ రికార్డును బద్దలు కొట్టడం గమనార్హం. గ్రాండ్ ఫినాలేకు అపూర్వమైన రీతిలో 21.7 టీవీఆర్‌ (ఎస్‌డీ+హెచ్‌డీ) లభించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్లలోనేకాదు.. దేశంలోని మరే ఇతర(భాషల్లోని) బిగ్ బాస్ షోలకంటే ఇది అత్యధిక రేటింగ్ కావడం విశేషం.

ఒంగోలు: ఆమె ఇంట్లో దొంగలు పడ్డారు.. ఎదురింటాయనకు భారీ షాక్ -పోలీసుల ఎంట్రీతో అనూహ్య ట్విస్ట్ఒంగోలు: ఆమె ఇంట్లో దొంగలు పడ్డారు.. ఎదురింటాయనకు భారీ షాక్ -పోలీసుల ఎంట్రీతో అనూహ్య ట్విస్ట్

ఎన్డీఆర్, నానిలను తలదన్నేలా..

ఎన్డీఆర్, నానిలను తలదన్నేలా..

హిందీలో ఎప్పటి నుంచో బిగ్ బాస్ షో నడుస్తుంగా, ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ సహా ఇతర భాషల్లో నాలుగేళ్ల కిందటి నుంచే ఈ రియాలిటీ షోను మొదలు పెట్టడం తెలిసిందే. తెలుగు బిగ్ బాస్ కు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్‌కు 16.18రేటింగ్ రాగా, నానీ హోస్ట్ చేసిన రెండవ సీజన్‌కు 15.0రేటింగ్ వచ్చింది. నాగార్జున హోస్ట్ చేసిన మూడవ సీజన్‌కు 17.92రేటింగ్ రాగా.. ఇప్పుడు అదే నాగార్జున హోస్టుగా వ్యవహరించిన నాలుగవ సీజన్ గ్రాండ్ ఫినాలేకు 21.7పాయింట్ల అత్యధిక రేటింగ్ లభించింది.

విజేత అభిజీత్.. క్రేజీ సోహైల్..

విజేత అభిజీత్.. క్రేజీ సోహైల్..

బిగ్‌బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫైనల్‌కు ముఖ్య అతిధిగా చిరంజీవి వచ్చిన సంగతి తెలిసిందే. అభిజీత్, సోహెల్, అఖిల్, హారిక, అరియానా గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టగా.. అత్యధిక ఓట్లతో అభిజీత్ విజేతగా నిలిచాడు. అఖిల్‌కు రెండో స్థానం దక్కింది. మొత్తం రూ.50 లక్షల ప్రైజ్ మనీ నుంచి సగం రూ.25 లక్షలు తీసుకొని సోహెల్ షో నుంచి బయటికి వచ్చేశాడు. విన్నర్ ప్రైజ్ మనీని తగ్గించడంపై తీవ్ర వివాదం చెలరేగింది. అదే సమయంలో మెహబూబ్ సైగలతో సోహైల్ మూడో స్థానంలో ఉన్నాడని చెప్పాడనే వీడియో కలకలం రేపింది. దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు వివరణ ఇవ్వనప్పటికీ, విజేత అభిజీత్ దాన్నొక చిన్న విషయంగా తీసుకున్నాడు. ఇకపోతే..

అక్కినేని నాగార్జున కీలక సందేశం..

అక్కినేని నాగార్జున కీలక సందేశం..

మొత్తానికి బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ ముగిసిన వారం రోజులకుగానీ టీఆర్పీ రేటింగ్ లెక్కలు రావడంతో వాటిని చూసి తెగ సంబరపడిపోతున్నాడు హోస్ట్ అక్కినేని నాగార్జున. ఈ సందర్భంగా తన ట్విటర్ లో నాగ్ కీలక సందేశం ఇచ్చారు. తెలుగు సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకు 21.7టీవీఆర్ దక్కిందన్న విషయాన్ని పోస్టు చేస్తూ.. ‘‘వావ్! మీ ప్రేమకు కృతజ్ఞతలు. మీ ప్రోత్సాహం లేకుండా మేం దీన్ని సాధించలేకపోయేవారం. కంటెస్టెంట్ల తరఫున ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని నాగార్జున పేర్కొన్నారు. షో మధ్యలో దసరా పండుగ నాడు నాగార్జున కోడలు సమంత స్పెషల్ హోస్టింగ్ చేసిన రోజు కూడా షోకు రేటింగ్ గణనీయంగా రావడం తెలిసిందే.

English summary
Nagarjuna Akkineni hosted Bigg Boss Telugu 4’s finale episode has set highest TRP (Television rating point) ever. The finale episode of the fourth season breaks TRP records of previous three seasons. Yes, you read that ride! The finale episode that saw Abijeet as the winner of the season has recorded 21.7 TVR, which is said to be the highest viewership across any Bigg Boss in India. The first, second and third seasons' finale had garnered TRPs of 14.13, 15.05 and 18.29 respectively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X