• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu:హౌజ్‌లోకి మరో వైల్డ్‌ కార్డ్ ఎంట్రీ-ఎవరా సెలబ్రిటీ, ఇక షో రేటింగ్స్ తారాస్థాయికి..!

|

బిగ్‌బాస్ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సమయంలో ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నిర్వాహకులు తీసుకుంటున్న నిర్ణయాలతో అసలుకే మోసం వచ్చేలా కనిపిస్తోంది. షో తొలినాళ్లలో చాలా మందకొడిగా సాగిన షో... వన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి ఎంటర్ అయిన జబర్దస్త్ అవినాష్, కుమార్ సాయి, స్వాతిలతో షో కాస్త ఊపందుకుంది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన ముగ్గురిలో ఇద్దరు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. ఇందులో కుమార్ సాయి ఎలిమినేషన్ పై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తాజాగా దివిని ఇంటి నుంచి పంపివేయడంతో షో రేటింగ్స్ పడిపోతున్నాయనే భావనలో ఉన్న నిర్వాహకులు మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంకో సెలబ్రిటీని హౌజ్‌లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఆ సెలబ్రిటీ ఎవరు..?

Big Boss Telugu:సాక్షి దీక్షిత్‌లా తయారవుతున్నారా.. ఆమెలానే వెళ్లిపోతారు: నాగార్జున వార్నింగ్

ఎలిమినేషన్ ప్రక్రియ పై అసంతృప్తి

ఎలిమినేషన్ ప్రక్రియ పై అసంతృప్తి

పలువురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ను ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా నిర్వాహకులు బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగినట్లు సమాచారం. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ముగ్గురిని ప్రవేశపెట్టడం అందులో ఇద్దరు ఎగ్జిట్ అవ్వడం జరిగిపోయింది. తాజాగా నాలుగో సెలబ్రిటీని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకురానున్నట్లు ఇన్‌సైడ్ సమాచారం. ఇక ఆ సెలబ్రిటీ ఎవరో కాదు... రాయలసీమలో పుట్టినప్పటికీ తెలంగాణ బిడ్డగా గుర్తింపు పొంది తన జానపద పాటలతో దేశ విదేశాల్లో అభిమానులను సొంతం చేసుకున్న ఆర్టిస్ట్ మంగ్లీ. అవును... మంగ్లీని బిగ్‌బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ చేయించి షోను రక్తి కట్టించాలని భావిస్తున్నారట షో నిర్వాహకులు.

మంగ్లీతో చర్చలు

మంగ్లీతో చర్చలు

ఇప్పటికే మంగ్లీతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అసలు బిగ్‌బాస్ తెలుగు సీజన్ -4 కాన్సెప్ట్ అనుకున్నప్పుడే మంగ్లీ ఒక కంటెస్టెంట్‌గా ఉంటుందనే వార్తలు జోరుగా షికారు చేశాయి. కానీ కొన్ని కారణాల వల్ల మంగ్లీ తప్పుకున్నట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక తాజాగా మంగ్లీని ఇంటిలోకి ప్రవేశపెడితే షో అదిరిపోతుందని నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ఆమెకు భారీగా పారితోషికం కూడా ముట్టచెప్పినట్లు సమాచారం. ముందుగా ఓ వార్తా ఛానెల్‌లో పనిచేసిన మంగ్లీ ఆ తర్వాత తన ఆటపాటలతో తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాకుండా కాకుండా దేశ విదేశాల్లో అభిమానులను సొంతం చేసుకుంది. గళం ఎత్తి పాడిందంటే చాలు అభిమానులు ఊగిపోతారు.

  Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, దివి లేకుండా బిగ్‌బాస్ చూడలేను అంటూ నెటిజన్లు!!
   జానపదాల నుంచి సినిమా పాటల వరకు..

  జానపదాల నుంచి సినిమా పాటల వరకు..

  జానపద పాటలు, తెలంగాణ యాసలో పాటలు పాడి ఎంతో మందిని మెస్మరైజ్ చేసిన మంగ్లీ.. పలు హిట్ సినిమాలకు కూడా పాడింది. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో రాములో రాములా సాంగ్‌లో తన గొంతును వినిపించి గాయనిగా మంచి పేరును సంపాదించింది. ఇక జార్జ్ రెడ్డి సినిమాలో "వాడు నడిపే బండి రాయలు ఎనిఫీల్డు" అంటూ పాడిన పాట ఒక ఊపు ఊపేసింది. శైలజరెడ్డి అల్లుడు చిత్రంలో కూడా పాడిన పాట బాగా పాపులర్ అయ్యింది. ఇక బతుకమ్మ, సంక్రాంతి, ఇలా పలు పండగల వేళ పాడుతున్న స్పెషల్ సాంగ్స్‌కు యూట్యూబ్‌లో కొన్ని లక్షల వ్యూస్ వస్తున్నాయి.

  మొత్తానికి మంగ్లీ బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయితే చాలా మందకొడిగా సాగుతున్న షోలో ఒక్కసారిగా ఊపొచ్చే అవకాశం ఉందని చాలామంది నెటిజెన్లు చెబుతున్నారు. పల్లె పాటలు, జానపదాలు హౌజ్‌లో పాడితే ఇటు వయసైపోయిన వారు కూడా టీవీలకు అతుక్కుపోవడం గ్యారెంటీ అని చెబుతున్నారు నెటిజెన్లు.

  English summary
  If sources are to be believed folk singer Mangli is all set to make an entry in to the Bigg Boss house on a wild card.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X